Hardik Pandya : భారత క్రికెట్‌ చరిత్రలో మరే ఇతర కెప్టెన్‌కు సాధ్యంకాని రికార్డ్‌.. హార్ధిక్‌ పాండ్యాకే సొంతం.. ఎందుకంటే..?

భారత టీ20 కెప్టెన్‌గా హార్ధిక్‌ పాండ్యా అరుదైన రికార్డు నెలకొల్పాడు. భారత క్రికెట్‌ చరిత్రలో మరే ఇతర కెప్టెన్‌కు సాధ్యంకాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. భారత కెప్టెన్‌గా తొలి 6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు (న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ టై గా ముగిసింది) సాధించి, అపజయమెరుగని కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.
Hardik Pandya Records

ఈ క్రమంలో హార్ధిక్‌.. టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రికార్డును బద్ధలు కొట్టాడు. రోహిత్‌ కూడా కెప్టెన్‌గా తన తొలి 6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించినప్పటికీ.. అతని సారధ్యంలో టీమిండియా మధ్యలో ఓ మ్యాచ్‌లో (5వ మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓటమి) ఓడింది.

☛ ఈ ఏడాది టీ20ల్లో టీమిండియా విధ్వంసకర ఆటగాడు ఈత‌నే..

అయితే రోహిత్‌ టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ అయ్యాక వెనుదిరిగి చూడలేదు. శ్రీలంక చేతిలో ఓటమి తర్వాత హిట్‌మ్యాన్‌ టీమిండియాను వరుసగా 7 మ్యాచ్‌ల్లో విజేతగా నిలిపాడు. ఆ తర్వాత 4 మ్యాచ్‌ల్లో 3 ఓటముల తర్వాత రోహిత్‌ మళ్లీ పుంజుకన్నాడు. ఈసారి వరుసగా 14 మ్యాచ్‌ల్లో టీమిండియాను విజేతగా నిలిపాడు. టీ20ల్లో వరుస అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా ఈ రికార్డు ఇప్పటికీ హిట్‌మ్యాన్‌ పేరిటే ఉంది.

☛ ఐపీఎల్ 2023 వేలంలో అత్యధికంగా ధ‌ర ప‌లికిన ఆట‌గాళ్లు వీరే..

రెగ్యులర్‌ కెప్టెన్‌ కాకుండానే..


పూణే వేదికగా శ్రీలంకతో జనవరి 5వ తేదీన‌ జరుగనున్న రెండో టీ20, కెప్టెన్‌గా హార్ధిక్‌కు 7వ మ్యాచ్‌. ఈ మ్యాచ్‌లోనూ హార్ధిక్‌ టీమిండియాను విజయపధంలో నడిపిస్తే.. హిట్‌మ్యాన్‌ వరుస విజయాల రికార్డుకు మరింత చేరువవుతాడు. టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ కాకుండానే హార్ధిక్‌ ఈ రికార్డులు తన ఖాతాలో వేసుకోవడం కొసమెరుపు. ఇదిలా ఉంటే, శ్రీలంకతో ఇవాళ జరుగనున్న రెండో టీ20లో గెలిచి, మరో మ్యాచ్‌ మిగిలుండగానే ఎలాగైనా సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. మరోవైపు లంక సైన్యం సైతం ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ ఆశలు సజీవంగా నిలుపుకోవాలని భావిస్తుంది. భారత్‌-శ్రీలంక మధ్య రెండో టీ20 రాత్రి 7 గంటలకు ప్రారంభంకానుంది.

☛ T20 World Cup 2022 : టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు వీరే.. ఇప్పటి వరకు ఈ రికార్డుల‌ను ఎవరూ

#Tags