Subhash Chandra Bose Quotes: నేతాజీ సుభాష్ చంద్రబోస్ నుంచి యువతకి స్పూర్తినిచ్చే అంశాలు ఇవే..

భారత దేశ స్వాతంత్య్ర సమరయోధుడు.. అత్యంత ప్రసిద్ధ విప్లవకారుడు.. సుభాష్‌ చంద్రబోస్‌. దేశానికి స్వాతంత్య్రన్ని గౌరవాన్ని ఇవ్వడానికే సంవత్సరాలపాటు పోరాటాలు చేశారు.

భారత దేశ స్వాతంత్య్ర సమరయోధుడు.. అత్యంత ప్రసిద్ధ విప్లవకారుడు.. సుభాష్‌ చంద్రబోస్‌. దేశానికి స్వాతంత్ర్యన్ని గౌరవాన్ని ఇవ్వడానికే సంవత్సరాలపాటు పోరాటాలు చేశారు. దేశం కోసం ప్రాణాలను వదిలిన సుభాష్‌ చంద్రబోస్‌ను అందరూ నేతాజి సుభాష్‌ చంద్రబోస్‌ అని పిలుస్తారు. నిజానికి నేతాజి అనేది ఆయనకు బిరుదుగా వచ్చిన పేరు. దానిని భారత్‌ సైనికుల చేత బెర్లిన్‌లో స్పెషల్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియా తరపున జర్మన్‌ భారత్‌ అధికారులు అందజేశారు.  నేడు 23, జనవరి సందర్భంగా నేతాజి పాటించే ఎన్నో అంశాలలో ఈ పది స్పూర్తినిచ్చే మాటలను తెలుసుకుందాం..

Chief Secretary of Assam: అసోం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సిక్కోలు వాసి..

స్పూర్తిగా నిలిచిన నేతాజి మాటలు..

➤ నీ రక్తాన్ని ఇస్తే, నీకు స్వాతంత్య్రన్ని ఇస్తాను.

➤ స్వాతంత్య్రం ఇచ్చేది కాదు, దానిని గెలుచుకోవాలి.

➤ చరిత్రలో అసలైన మార్పు చర్చలతో ఎప్పుడూ జరగలేదు.

Queen Margrethe II: పదవీ విరమణ చేయనున్న డెన్మార్క్ రాణి మార్గరేట్-II

➤ మన దేశానికి గెలుపును మన రక్తంతో మనమే ఇవ్వాలి. మనం చేసే త్యాగం, కృషితో గెలిచిందే మనం కాపాడుకోగలం.

➤ ఒక ఆలోచనతో వ్యక్తి చనిపోవచ్చు.. కానీ, తరువాత ఆ ఆలోచనను లక్షలాది మందిలో అది అవతరిస్తుంది.

➤ జాతీయవాదం మానవ జాతిలోని అత్యున్నత ఆదర్శాల నుండి ప్రేరణ పొందింది.. అంటే, సత్యం (నిజం), శివం (దేవుడు), సుందరం (అందం).

World's Richest Woman: ఈమె ప్రపంచంలోకెల్లా సంపన్నురాలు.. ‘లో రియాల్‌’ వైస్‌ ప్రెసిడెంట్‌ రికార్డు..!

➤ నిజానికి రాజకీయాల్లో ఉండే బేరసారాలు మీకన్నా చాలా బలంగా కనిపించేలా ఉంటాయి.

➤ కష్ట నష్టాలు లేని జీవితంలో మనం సగం ఆశలన్నింటినీ వ్యర్ధం చేసుకున్నట్లే.

➤ తప్పులు చేసే స్వేచ్ఛ లేకుంటే... ఆ స్వేచ్ఛకు విలువ లేదు.

➤ మన జీవితాన్ని ఎక్కువ శాతం సత్యం పైనే నిర్మించుకోవాలి.

#Tags