Taj Mahal: ఆగ్రాలో మరో తాజ్ మహల్.. రాధాస్వామి సత్సంగ్ భవనం

ఆగ్రా అంటేనే తాజ్ మహల్ అని అందరికీ తెలుసు. కానీ.. ఇక్కడే మరో అద్భుతమైన పాలరాతి భవనం ఉందని తెలిస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది.

ఈ భవనం తాజ్ మహల్‌కు పోటీనిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

రాధాస్వామి సత్సంగ్ శాఖ వ్యవస్థాపకుడు పరమ పురుష్ పూరన్ ధని స్వామీజీ సమాధి స్థలంపై నిర్మించబడిన ఈ భవనం, స్వచ్ఛమైన తెల్లని పాలరాతితో నిర్మితమై, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

తాజ్ మహల్ నుంచి 12 కి.మీ దూరంలో ఉన్న స్వామి బాగ్‌లో ఈ భవనం ఉండడం వల్ల దీనిని "రెండో తాజ్ మహల్" అని కూడా పిలుస్తారు.

193 అడుగుల ఎత్తు ఉన్న ఈ భవనం.. రాజస్థాన్‌లోని మక్రానా నుంచి తెచ్చిన తెల్లని పాలరాతితో నిర్మించబడింది.

Blue Hole: సముద్ర గర్భంలో ఉండే లోతైన నీలి రంధ్రం బిలాలు ఇవే..

ఈ భవన నిర్మాణం 1904లో ప్రారంభమైంది. కొంతకాలం ఆగిపోయిన తర్వాత, 1922లో మళ్లీ ప్రారంభమైంది. ఈ భవన నిర్మాణంలో హస్తకళాకారుల నైపుణ్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మూడు తరాలకు చెందిన కళాకారులు ఈ భవన నిర్మాణంలో పాల్గొన్నారు.

తాజ్ మహల్ కంటే పొడవైన శిఖరం ఈ భవనానికి ప్రత్యేక ఆకర్షణ. రాధాస్వామి అనుచరులకు ఈ భవనం ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రం. ప్రతిరోజూ వందలాది మంది భక్తులు ఈ సమాధి స్థలాన్ని సందర్శిస్తారు. ఫోటోగ్రఫీకి అనుమతి లేకపోవడం ఈ భవనం యొక్క ప్రత్యేకత. 

ఉత్తరప్రదేశ్, పంజాబ్, కర్ణాటక‌తో పాటు అనేక రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా లక్షలాది మంది రాధాస్వామి అనుచరులు ఈ భవనాన్ని సందర్శిస్తారు.

Happiest Country: ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం ఏదో తెలుసా?

#Tags