Bharat Ratna Award Winners- 'భారతరత్న'పురస్కారం..ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారు?
1954లో తొలిసారి భారతరత్న..
అలా మొదటిసారిగా స్వతంత్ర భారత తొలి గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి,ప్రముఖ శాస్త్రవేత్త, డాక్టర్ సివి రామన్, భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ 1954లో భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు. అప్పటివరకు ఈ అవార్డును జీవించి ఉన్నవారికే ఇచ్చేవారు. కానీ ఆ మరుసటి ఏడాది అంటే 1955 నుంచి ఈ అవార్డును మరణానంతరం ఇవ్వడం ప్రారంభించారు.
Biography of LK Advani: అద్వానీ చిరకాల కోరిక అదే, కానీ ఆయన స్థానంలో మోదీ..
భారతరత్న.. ప్రతి ఏటా ఇస్తారా?
ఈ అవార్డులను ఎంపిక చేసే ప్రక్రియ పద్మ అవార్డుల కంటే భిన్నంగా ఉంటుంది.ప్రధానమంత్రి నేరుగా రాష్ట్రపతికి భారతరత్న అవార్డు కోసం వ్యక్తులను సిఫారసు చేస్తారు. ఏడాదిలో గరిష్టంగా ముగ్గురికి మాత్రమే భారతరత్న ఇస్తారు. అయితే ప్రతి ఏటా ఈ అవార్డు ఇవ్వాలనే నిబంధన ఏమీ లేదు. కాగా ఇప్పటివరకూ 50 మంది ప్రముఖులు ‘భారతరత్న’ను అందుకున్నారు. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా విజేతలను రాష్ట్రపతి సత్కరిస్తారు
మరణానంతరం కూడా భారతరత్న
వీరిలో 17 మందికి మరణానంతరం భారతరత్న లభించింది. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మొదలుకొని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వరకు... ఇలా పలువురు ‘భారతరత్న’ పురస్కారం అందుకున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు ప్రముఖ గాంధేయ సోషలిస్ట్ నేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్,మాజీ ఉప ప్రధాని ఎల్ కె అద్వానీకి చోటు దక్కింది.
భారతరత్న గ్రహీతలకు ఏం అందజేస్తారు?
భారతరత్న గ్రహీతలకు రాష్ట్రపతి సంతకం చేసిన ధ్రువీకరణ పత్రం, ఒక మెడల్ బహూకరిస్తారు. రావి ఆకు రూపంలో ఉన్న మెడల్‌పై ప్రకాశిస్తున్న సూర్యుడి బొమ్మ, దేవనాగరి లిపిలో భారతరత్న అని రాసి ఉంటుంది. వెనుకవైపు భారత జాతీయ చిహ్నం, కింద దేవనాగరి లిపిలో సత్యమేవ జయతే అనే అక్షరాలు ఉంటాయి. అయితే భారతరత్న గ్రహీతలకు ఎలాంటి నగదు ప్రోత్సాహకం ఉండదు. కానీ ప్రత్యేక ప్రాధాన్యం, సదుపాయాలు వంటివి లభిస్తాయి.
ఇప్పటివరకు ‘భారతరత్న’ అందుకున్నవారు
1. చక్రవర్తి రాజగోపాలాచారి (రాజకీయవేత్త, రచయిత, న్యాయవాది, స్వాతంత్య్ర సమరయోధుడు)- 1954
2. సర్వేపల్లి రాధాకృష్ణన్ (తత్వవేత్త, రాజకీయవేత్త, భారత మాజీ రాష్ట్రపతి)- 1954
3. చంద్రశేఖర్ వెంకట రామన్ (భౌతిక శాస్త్రవేత్త)- 1954
4. భగవాన్ దాస్ (స్వాతంత్ర్య పోరాట యోధుడు, తత్వవేత్త, విద్యావేత్త)- 1955
5. మోక్షగుండం విశ్వేశ్వరయ్య (సివిల్ ఇంజనీర్, రాజకీయవేత్త, మైసూర్ దివాన్)- 1955
6. జవహర్‌లాల్ నెహ్రూ (స్వాతంత్ర్య సమర యోధుడు, రచయిత, భారత మాజీ ప్రధాని)- 1955
7. గోవింద్ వల్లభ్ పంత్ (స్వాతంత్ర్య సమరయోధుడు)- 1957
8. ధోండో కేశవ్ కర్వే (సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుడు)- 1958
9. బిధాన్ చంద్ర రాయ్ (వైద్యుడు, రాజకీయ నేత , పరోపకారి, విద్యావేత్త, సామాజిక కార్యకర్త) - 1961
10. పురుషోత్తం దాస్ టాండన్ (స్వాతంత్ర్య సమర యోధుడు)- 1961
11. రాజేంద్ర ప్రసాద్ (స్వాతంత్ర్య సమర యోధుడు, న్యాయవాది, రాజకీయవేత్త, పండితుడు, భారత మాజీ రాష్ట్రపతి)- 1962
12. జాకీర్ హుస్సేన్ (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1963
13. పాండురంగ్ వామన్ కేన్ (ఇండాలజిస్ట్, సంస్కృత పండితుడు)-1963
14. లాల్ బహదూర్ శాస్త్రి (మరణానంతరం) (స్వాతంత్ర్య సమర యోధుడు, భారత మాజీ ప్రధాని) – 1966
15. ఇందిరా గాంధీ (రాజకీయనేత, భారత మాజీ ప్రధానమంత్రి)-1971
16. వరాహగిరి వెంకట గిరి (స్వాతంత్ర్య సమరయోధుడు, భారత మాజీ రాష్ట్రపతి)-1975
17. కుమారస్వామి కామరాజ్ (మరణానంతరం) (రాజకీయవేత్త, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి) - 1976
18. మదర్ మేరీ థెరిసా బోజాక్షియు (మదర్ థెరిసా) (మిషనరీస్ ఆఫ్ ఛారిటీ వ్యవస్థాపకురాలు) - 1980
19. వినోబా భావే (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు, సంఘ సంస్కర్త)-1983
20. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (స్వాతంత్ర్య పోరాట యోధుడు)-1987
21. మరుదూర్ గోపాలన్ రామచంద్రన్ (మరణానంతరం) (రాజకీయనేతగా మారిన నటుడు)-1988
22. భీమ్ రావ్ రామ్‌జీ అంబేద్కర్ (మరణానంతరం) (సంఘ సంస్కర్త)-1990
23. నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా (వర్ణవివక్ష వ్యతిరేక పోరాట నేత)- 1990
24. రాజీవ్ గాంధీ (మరణానంతరం) (రాజకీయనేత, భారత మాజీ ప్రధాని)-1991
25. సర్దార్ వల్లభాయ్ పటేల్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1991
26. మొరార్జీ రాంచోడ్జీ దేశాయ్ (స్వాతంత్ర్య పోరాట వీరుడు, భారత ప్రధాని)- 1991
27. మౌలానా అబుల్ కలాం ఆజాద్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు)-1992
28. జహంగీర్ రతన్‌జీ దాదాభాయ్ టాటా (పారిశ్రామికవేత్త)- 1992
29. సత్యజిత్ రే (చిత్ర నిర్మాత)- 1992
30. గుల్జారీ లాల్ నందా (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1997
31. అరుణా అసఫ్ అలీ (మరణానంతరం) (స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు)- 1997
32. ఎ.పి.జె. అబ్దుల్ కలాం ( శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి)-1997
33. మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (కర్ణాటక శాస్త్రీయ గాయని)-1998
34. చిదంబరం సుబ్రమణ్యం (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1998
35. జయప్రకాష్ నారాయణ్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు, సంఘ సంస్కర్త)- 1999
36. అమర్త్య సేన్ (ఆర్థికవేత్త)- 1999
37. ప్రకాష్ గోపీనాథ్ బోర్డోలోయ్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు) – 1999
38. రవిశంకర్ (సితార్ వాద్యకారుడు) - 1999
39. లతా దీనానాథ్ మంగేష్కర్ (గాయని)- 2001
40. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ (హిందుస్తానీ క్లాసికల్ షెహనాయ్ ప్లేయర్)- 2001
41. భీంసేన్ గురురాజ్ జోషి (హిందుస్తానీ క్లాసికల్ సింగర్)- 2009
42. సిఎన్ఆర్ రావు (కెమిస్ట్, ప్రొఫెసర్)- 2014
43. సచిన్ రమేష్ టెండూల్కర్ (క్రికెటర్)- 2014
44. అటల్ బిహారీ వాజ్‌పేయి (రాజకీయ నేత, భారత మాజీ ప్రధాని)- 2015
45. మదన్ మోహన్ మాలవీయ (మరణానంతరం) (పండితులు, విద్యా సంస్కర్త)- 2015
46. నానాజీ దేశ్‌ముఖ్ (మరణానంతరం) (సామాజిక కార్యకర్త)- 2019
47. భూపేంద్ర కుమార్ హజారికా (మరణానంతరం) (ప్లేబాక్ సింగర్, గేయ రచయిత, సంగీతకారుడు, కవి, చలనచిత్ర నిర్మాత) - 2019
48. ప్రణబ్ ముఖర్జీ (రాజకీయనేత, భారత మాజీ రాష్ట్రపతి)- 2019
49. కర్పూరి ఠాకూర్ (మరణానంతరం) (రాజకీయనేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి) – 2024
50. ఎల్‌కే అద్వానీ(రాజకీయ నేత, భారత మాజీ ప్రధాని)-2024
51. ఎం.ఎస్. స్వామినాథన్ (వ్యవసాయ శాస్త్రవేత్త, మొక్కల జన్యు శాస్త్రవేత్త, మానవతావాది. హరిత విప్లవానికి ప్రపంచ నాయకుడు) - 2024
52. చౌదరి చరణ్ సింగ్ (భారతదేశానికి 5వ ప్రధానమంత్రిగా 1979 జూలై 28 నుండి 1980 జనవరి 14 వరకు తన సేవలనందించాడు) - 2024
53. P. V. నరసింహారావు (1991 నుండి 1996 వరకు భారతదేశ 9వ ప్రధానమంత్రిగా పనిచేసిన భారతీయ న్యాయవాది మరియు రాజకీయవేత్త. అతను భారతదేశ ఆర్థిక వ్యవస్థకు అనేక ఉదారవాద సంస్కరణలను ప్రవేశపెట్టడంలో ప్రసిద్ధి చెందాడు.) - 2024