Cyber Crimes : నయా పద్ధతుల‌తో సైబ‌ర్ నేర‌గాళ్లు.. జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌న‌సరి అంటున్న పోలీసులు

సైబర్‌ నేరం.. అవగాహనతోనే దూరం.. నినాదంతో జిల్లా పోలీసు యంత్రాంగం విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది.

గుడ్లవల్లేరు: సైబర్‌ నేరగాళ్లు కొత్తపద్ధతులతో ప్రజలను మోసగిస్తున్నారు. హలో అంటారు.. అంతలోనే దోచేస్తారు. వీరి దెబ్బకు ఉన్నత ఉద్యోగస్తులే అధికంగా మోసపోతున్నారు. జిల్లాలో ఈ ఏడాది అధికారిక లెక్కల ప్రకారం 62 కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య ఎక్కువగానే ఉన్నా.. చెప్పుకోలేని కారణాలతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడం లేదు. సైబర్‌ నేరం.. అవగాహనతోనే దూరం.. నినాదంతో జిల్లా పోలీసు యంత్రాంగం విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. మోసాలకు గురైతే సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌ లైన్‌ నంబర్‌ 1930కు డయల్‌ చేయవచ్చు. cybercrime.gov.in కు ఫిర్యాదు చేయొచ్చని పోలీసులు పిలుపునిస్తున్నారు.

Job Recruitment: ఇంజనీర్‌ జాబ్స్‌ కోసం నోటిఫికేషన్‌.. జీతం రూ.25వేలు

డిజిటల్‌ అరెస్ట్‌

సైబర్‌ నేరగాళ్లు ప్రజల్ని భయకంపితుల్ని చేస్తున్నారు. ముంబైలో కొరియర్‌ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామంటూ ఫోన్‌ చేస్తారు. మీ పేరుతో విదేశాల నుంచి పార్సిల్‌ వచ్చింది.. అందులో మాదకద్రవ్యాలు, ఆయుధాలున్నాయని చెప్పి హడలెత్తిస్తారు. ఆధార్‌, పాన్‌, బ్యాంక్‌ వివరాలను తెలుసుకుని ముంబై సైబర్‌ క్రైం, నార్కోటిక్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఫోన్‌ కట్‌ చేస్తారు. కొంతసేపటికి ముంబై సైబర్‌ క్రైం పోలీసు విభాగం నుంచి ఫోన్‌ చేస్తున్నామని కాల్‌ వస్తుంది. మిమ్మల్ని ఒక హోటల్‌ రూమ్‌ లేదా ఇంట్లోనే ఇక గదిలో ఒంటరిగా ఉంటే విచారణ చేస్తామని నమ్మబలుకుతారు. అనంతరం వీడియో కాల్‌లో మాట్లాడుతూ మీ వ్యక్తిగత సమాచారం మొత్తం లాగేస్తారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

కేసు నుంచి బయట పడేయాలంటే చెప్పినంత మొత్తం చెల్లించాలని...లేకపోతే అరెస్ట్‌ తప్పదని భయపెడతారు. ఆ ఆగంతకులు అడిగినంత ఖాతాలో జమయ్యాకే వదులుతారు. ఇలా మనిషిని ఎటూ వెళ్లకుండా నిర్బంధించడమే డిజిటల్‌ అరెస్ట్‌. అలాగే ఈడీ అధికారులమంటూ ఫోన్‌ చేసి మీరు మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారని చెబుతారు. మీ వ్యక్తిగత బ్యాంక్‌ ఖాతాలో ప్రస్తుతం ఉన్న నగదు అక్షరాలతో సహా వివరాలు చెప్పి నమ్మేలా చేస్తారు. అప్పటికీ నమ్మకపోతే వీడియో కాల్‌ చేసి తాము అడిగినది ఇవ్వకపోతే అరెస్ట్‌ చేస్తామని బెదిరించి అందిన కాడికి దోచుకుంటారు.

సోషల్‌ మీడియా ప్రకటనల ద్వారా

ట్రేడింగుల్లో పెట్టుబడులు పెట్టండి. కళ్లు చెదిరే ఆదాయం పొందండంటూ సోషల్‌ మీడియా ప్రకటనల ద్వారా ఆకర్షిస్తారు. మిమ్మల్ని నకిలీ వెబ్‌సైట్‌కు మళ్లించి నకిలీ పోర్ట్‌ఫోలియో చూపిస్తారు. స్కామర్లు తొలుత తక్కువ మొత్తంలో చాలా ఎక్కువ రాబడి ఇస్తారు. మిమ్మల్ని మరింత పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించి ఎర వేసి ఉచ్చు బిగిస్తారు. ఆ తర్వాత పెట్టుబడుల విత్‌డ్రాకు మీరు ప్రయత్నించినప్పుడు అందుబాటులో ఉండకుండా తుర్రుమంటారు.

Technical Certificate Course: జనవరిలో టీసీసీ పరీక్షలు.. ఫీజు వివరాలివే

ట్రాయ్‌ పేరిట...

మీ మొబైల్‌ను చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు వినియోగించారని టెలికామ్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ట్రాయ్‌) నుంచి కాల్‌ చేస్తున్నామని చెబుతారు. మీ ఫోన్‌ నంబర్‌ సేవలను నిలిపివేస్తున్నామని, సైబర్‌ క్రైం పోలీసుల విచారణ సాగుతుందంటూ కాల్‌ను మోసగాళ్లకు ఫార్వర్డ్‌ చేస్తారు. మోసగాడు వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంక్‌ ఖాతాల వివరాలను సేకరించి నగదు లాగేస్తారు.

క్రెడిట్‌ కార్డు స్కామ్‌

ఇటీవల క్రెడిట్‌ కార్డుల స్కామ్‌లు అధికమయ్యాయి. బ్యాంక్‌ నుంచి కాల్‌ చేస్తున్నాం. మీ క్రెడిట్‌ కార్డుల్లో పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగాయంటూ.. దానికి సంబంధిత వెరిఫికేషన్‌ చేయాలని నమ్మబలుకుతారు. కార్డు వివరాలు సీవీవీ, ఓటీపీ తెలుసుకుని అకౌంట్‌ను ఖాళీ చేస్తారు.

జారుకుంటారు

యూట్యూబ్‌ వీడియోలు లేదా సోషల్‌ మీడియా పోస్టులకు లైక్‌ చేయడం ద్వారా అధిక మొత్తంలో నగదు పొందవచ్చని ఆశ చూపిస్తారు. అధిక రాబడి కోసం క్రిప్టో లేదా ఇతర వాటిలో పెట్టుబడి పెట్టాలని అడుగుతారు. ఆ తర్వాత నమ్మకం కలిగించి మీతో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టించి మెల్లగా జారుకుంటారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

మోసగాళ్లను పసిగట్టాలి

మోసగాళ్లు చెప్పినవన్నీ నిజమని భావించవద్దు. డిజిటల్‌ అరెస్ట్‌లు లేవని ప్రధానిమోదీనే చెప్పారు. సీబీఐ, నార్కోటిక్స్‌, ఈడీ నుంచి మాట్లాడుతున్నామని ఎవరైనా చెబితే కచ్చితంగా అనుమానించాల్సిందే. ఏ దర్యాప్తు సంస్థ వీడియో కాల్స్‌లో విచారణ చేయదు. నేరుగా వచ్చి మాట్లాడతారు. మోసపూరిత కాల్‌ వస్తే సమీప పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేయాలి.

– ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎం.కామరాజు, ఎస్‌ఆర్‌జీఈసీ డైరెక్టర్‌

Job Recruitment: ఇంజనీర్‌ జాబ్స్‌ కోసం నోటిఫికేషన్‌.. జీతం రూ.25వేలు

క్రెడిట్‌ కార్డు వివరాలు చెప్పొద్దు

మీ పేరుపై క్రెడిట్‌ కార్డు జారీ చేస్తే లావాదేవీల వివరాలు ఎస్‌ఎంఎస్‌ రూపంలో మన మొబైల్‌కే వస్తాయి. బ్యాంక్‌ల నుంచి కాల్‌ చేస్తున్నాం...కార్డు వివరాలు, సీవీవీ, ఓటీపీ చెప్పాలని అడిగేవారు నకిలీ అనే విషయాన్ని గుర్తించాలి. అధిక ఆదాయం అందించే పథకం అదొక పెద్ద స్కామ్‌ అన్న విషయాన్ని గమనించాలి.

– ఎన్‌.వి.వి.సత్యనారాయణ, గుడ్లవల్లేరు ఎస్‌.ఐ

#Tags