Faculty Jobs: ఎయిమ్స్‌ బిలాస్‌పూర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

బిలాస్‌పూర్‌(హిమాచల్‌ప్రదేశ్‌)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. డైరెక్ట్‌/డిప్యూటేషన్‌/ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 110.
పోస్టుల వివరాలు:

  • ప్రొఫెసర్‌–22
  • అడిషనల్‌ ప్రొఫెసర్‌–16
  • అసోసియేట్‌ ప్రొఫెసర్‌–16
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌–56

విభాగాలు: అనెస్తీషియా, బయోకెమిస్ట్రీ, అనాటమీ, బర్న్స్‌ అండ్‌ ప్లాస్టిక్‌ సర్జరీ, కార్డియాలజీ, మెడికల్‌ ఆంకాలజీ, న్యూరోసర్జరీ, ఆర్థోపెడిక్స్, సర్జికల్‌ ఆంకాలజీ, పల్మనరీ మెడిసిన్, సైకియాట్రీ, రేడియాలజీ, యూరాలజీ, ఈఎన్‌టీ, డెంటిస్ట్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఎస్‌/డీఎం/ఎండీ /ఎంసీహెచ్‌ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయసు: ప్రొఫెసర్‌/అడిషనల్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు 58 ఏళ్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌/అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు 50 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హతలు, అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ డైరెక్టర్, అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్, మూడో అంతస్తు, ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌), కోతిపుర, బిలాస్‌పూర్, హిమాచల్‌ప్రదేశ్‌ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 22.01.2025.
వెబ్‌సైట్‌: www.aiimsbilaspur.edu.in

>> Indian Army Jobs: పదో తరగతి/ఇంటర్మీడియట్‌ అర్హతతో ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

#Tags