Job Interviews: గెస్ట్‌ టీచర్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు.. ఈ సర్టిఫికేట్స్‌ తప్పనిసరి

రంపచోడవరం: రంపచోడవరం, చింతూరు పరిధిలోని ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో గెస్ట్‌ టీచర్ల పోస్టుల భర్తీకి వచ్చేనెల 2న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు పీవో కట్టా సింహాచలం తెలిపారు. ఈ పోస్టులకు అభ్యర్థుల అర్హత వివరాలను ఐటీడీఏ నోటీస్‌ బోర్డులో ఉంచినట్టు ఆయన చెప్పారు.

వాటిలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30లోపు ఐటీడీఏలోని గురుకుల సెల్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. రంపచోడవరం గురుకుల బాలుర పాఠశాలలో నవంబరు 1న డెమో నిర్వహిస్తారని తెలిపారు.

Job Mela: జాబ్‌మేళా.. కావల్సిన అర్హతలు ఇవే

ఐటీడీఏ సమావేశం హాలులో నవంబరు 2న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు చెప్పారు. అభ్యర్థులు డెమో, ఇంటర్వ్యూలకు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరుకావాలని తెలిపారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags