Guest Lecturer Jobs: గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..
కోస్గి: ఈ విద్యా సంవత్సరం నుంచి కోస్గిలో ప్రారంభమవుతున్న నూతన మహిళా డిగ్రీ కళాశాలలో వివిధ సబ్జెక్టులు బోధించడానికి కాంట్రాక్ట్ పద్ధతిలో అతిథి అధ్యాపకులుగా పని చేయడానికి అర్హత గల వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాజారాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Highest Salaries To Employees: ఉద్యోగులకు కోటి రూపాయలకు పైగా జీతం ఇస్తున్న కంపెనీ..
ఇంగ్లీష్, బొటని, హిస్టరీ, కామర్స్, కంప్యూటర్ సైన్స్‌అండ్ అప్లికేషన్ సబ్జెక్టులకు సంబంధించి 5 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఆయా సబ్జెక్టుల్లో పీజీ చేసి 55 శాతం మార్కులు పొంది ఉండాలని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించి ఉండాలని, పీజీతోపాటు నెట్, పీహెచ్‌డీ, స్లెట్ కలిగిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.
ఆసక్తి ఉండి అర్హులైన అభ్యర్థులు గెస్ట్ ఫ్యాకల్టీ కోసం ఈ నెల 29వ తేది వరకు తమ దరఖాస్తులను కోడంగల్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల కార్యాలయంలో ఇవ్వాలని సూచించారు.