Public Exams 2023 : ఇక స‌మ‌యం లేదు మిత్ర‌మా.. ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌కు సిద్ధం అవ్వండిలా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇక సంక్రాంతి పండగ సెలవులు పూర్తయ్యాయి. ఆటపాటలతో గడిపిన విద్యార్థులు ముంచుకొస్తున్న పరీక్షలకు సన్నద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది.
AP Public Exams 2023 Details

వరుస పరీక్షలతో రానున్న 4 నెలలు బిజీబిజీగా గడపనున్నారు. తమ ముందున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు మెదడుకు పదును పెట్టనున్నారు. మరో వైపు ఆయా కోర్సుల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు సిలబస్‌ను పూర్తి చేసి రివిజన్‌తో పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. పరీక్షలు దగ్గర పడుతుండడంతో తమ పిల్లలు చదువుపై పూర్తిగా శ్రద్ధ పెట్టే విధంగా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్

ఏపీలో జ‌న‌వ‌రి మూడో వారం ప్రారంభం నుంచి జూన్‌ వరకు విద్యార్థుల భవిష్యత్‌కు కీలకమైన పరీక్షలు జరగనున్నాయి. ప్రధానంగా టెన్త్, ఇంటర్‌ విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలతో పాటు జేఈఈ, నీట్, అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు వరుసగా ఉన్నాయి. ఆయా విద్యా సంస్థలు సైతం తమ కళాశాలల్లో చదివే విద్యార్థుల ర్యాంకులపై దృష్టి సారించాయి.

➤ 2023లో స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇవే.. ఈ సారి ఉద్యోగుల‌కు మాత్రం..

వ‌రుస ప‌రీక్ష‌లు.. బీజీ షెడ్యుల్‌..

జ‌న‌వ‌రి 24వ తేదీ నుంచి 31వ తేదీ వరకు తొలి విడత జేఈఈ మెయిన్స్‌ పరీక్ష జరగనుంది. ఫిబ్ర‌వ‌రి 26వ తేదీ నుంచి మార్చి 7 వరకు  ఏపీ ఇంటర్‌ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ జరగనున్నాయి. ఇక మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు ఏపీ ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 3 నుంచి 18వ తేదీ వరకు ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 6 నుంచి 12వ తేదీ వరకు రెండో విడత జేఈఈ మెయిన్స్‌ పరీక్షను నిర్వహించనున్నారు. వీటితో పాటు ఇంటర్‌ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మే 7న నీట్, జూన్‌ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు జరగనున్నాయి. వీటితో పాటు ఎంసెట్‌ పరీక్షను కూడా అదే నెలలో నిర్వహించనున్నారు. దీంతో పాటు ఇంజినీరింగ్‌ పరీక్షలు కూడా మే నెలాఖరు లేదా జూన్‌ నెలలో నిర్వహించనున్నారు.

☛ ఎంసెట్ స్ట‌డీమెటీరియ‌ర్‌, సిల‌బ‌స్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

ర్యాంకులపై ప్ర‌త్యేక‌ సాధన.. 

ఆయా కోర్సుల్లో పరీక్షలకు సంబంధించి ఉత్తమ ఫలితాలు, ర్యాంకులు సాధనలో అధ్యాపకులు, ఉపాధ్యాయులతో పాటు ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు సాధన పెడుతున్నాయి. పదో తరగతి పరీక్షలకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జ‌న‌వ‌రి 20వ తేదీన‌ మెటీరియల్స్‌ను పంపిణీ చేశారు. అలాగే ప్రతి రోజు స్లిప్‌ టెస్ట్‌ నిర్వహించి వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదు ఇవ్వనున్నారు.

Also read: JEE Mains 2023 : జేఈఈ అర్హతలో మార్పులు ఇవే.. ఇంటర్‌లో కూడా..

సిలబస్‌ను..

ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రివిజన్‌ కూడా పూర్తి చేసి రోజు వారీ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇంటర్‌కు సంబంధించి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో సిలబస్‌ పూర్తి చేసి పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సిలబస్‌ పూర్తి చేసి జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్, నీట్, ఎంసెట్‌ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. డిగ్రీ, ఇంజినీరింగ్‌ విద్యార్థులను కూడా ఆ యాజమాన్యాలు పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు.

Also read: NTA: ఇంటర్‌లో ఇంత శాతం మార్కులు సాధిస్తేనే జేఈఈ మెయిన్స్‌కు..

#Tags