TS CPGET 2024: పీజీ ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల తేదీ ఇదే.. పరీక్ష కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలి

ఉస్మానియా యూనివర్సిటీ: పీజీ ప్రవేశ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీఎస్‌ సీపీజీఈటీ–2024 కన్వీనర్‌ ప్రొ.పాండురంగారెడ్డి జూన్ 23న‌ తెలిపారు.

జంటనగరాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 30 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఓయూతో పాటు కాకతీయ, జేఎన్‌టీయూ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, తెలంగాణ మహిళా యూనివర్సిటీలలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంఈడీ, ఇతర పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో 2024–25 విద్యా సంవత్సరానికి జూలై 6 నుంచి 15 వరకు 45 సబ్జెక్టులకు ప్రవేశ పరీక్ష జరగనున్నట్లు కన్వీనర్‌ వివరించారు.

ప్రవేశ పరీక్షల టైంటేబుల్‌ను వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. సీపీజీఈటీ–2024 దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జూలై 3 నుంచి హాల్‌టిక్కెట్లను www.osmania.ac.in, httpr://cpfet.trche.ac.in, www.ouadmirrionr.com ఈ వెబ్‌సైట్స్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

చదవండి: IAS Uma Harathi Real Life Story : అద్భుత‌మైన దృశ్యం.. IAS అయిన కూతురికి.. IPS అయిన తండ్రి సెల్యూట్.. ఈమె స‌క్సెస్ జ‌ర్నీ ఇదే..

జూలై 6 నుంచి ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 1 నుంచి 2.30 వరకు, సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు మూడు విడతలుగా జరిగే కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ)కు పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు గంట ముందుగా చేరుకోవాలన్నారు.

అనంతరం పరీక్ష హాల్‌లో 30 నిమిషాల ముందు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఇంత వరకు సీపీజీఈటీ–2024 దరఖాస్తు చేయని అభ్యర్థులు జూన్‌ 25 వరకు రూ.500 అపరాధ రుసముతో, జూన్ 30 వరకు రూ.2000 అపరాధ రుసముతో దరఖాస్తు చేసుకోవచ్చు. 
ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఎస్సీ డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులు ఎంఏ, ఎంకాం కోర్సులకు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నట్లు ప్రొ.పాండురంగారెడ్డి వివరించారు.  

#Tags