DEECET 2024: డైట్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ జిల్లా విద్యాశిక్షణ సంస్థలు (డీఐఈటీఎస్‌), ప్రభుత్వేతర ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్లో రెండేళ్ల ప్రాథమిక విద్య డిప్లమో కోర్సులో ప్రవేశం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు పాఠశాలవిద్య కమిషనర్‌ సురేష్‌కుమార్‌ ఏప్రిల్ 19న‌ తెలిపారు.

చదవండి: ఇంటర్‌తోనే ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశానికి మార్గం.. ప్రిపరేషన్‌ ఇలా..

ఏప్రిల్ 22వ తేదీ నుంచి నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి సమాచారం, పరీక్ష తేదీల వివరాలు  cse.ap.gov.in వెబ్‌సైట్‌లో ఉంటాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.   
 

#Tags