NTA NEET, JEE Exam Dates 2023 : నీట్‌, జేఈఈ-2024 ప‌రీక్ష‌ల తేదీ ఇవే.. ఏఏ ప‌రీక్ష ఎప్పుడంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ (NTA) నీట్‌, జేఈఈ ప‌రీక్ష‌ల తేదీల‌ను సెప్టెంబ‌ర్ 19వ తేదీన (మంగ‌ళ‌వారం) ప్ర‌క‌టించింది. మే 5, 2024వ తేదీన దేశవ్యాప్తంగా నీట్‌ యూజీ (NEET UG) పరీక్ష జరగనుంది.

ఇది పెన్ను పేపర్‌/ఓఎంఆర్‌ విధానంలో జరుగుతుంది. అలాగే జేఈఈ మెయిన్​ సెషన్​ 1 పరీక్ష 2024 జనవరి- ఫిబ్రవరిలో జరగనుంది. అలాగే రెండో సెషన్​ 2024 ఏప్రిల్​లో నిర్వహించనుంది ఎన్​టీఏ. ఈ మేర‌కు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు ప్రవేశ పరీక్షల తేదీల‌పై వార్షిక క్యాలెండర్‌ ను జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ప్రకటించింది.

☛ ఈ మెడికల్‌ కాలేజీల్లో 85 శాతం సీట్లు వీరికే.. ఎందుకంటే..?

ముఖ్య‌మైన ప‌రీక్ష‌ల తేదీల వివ‌రాలు ఇవే..

☛ నీట్‌ యూజీ - మే 5, 2024 (ఇది పెన్ను పేపర్‌/ఓఎంఆర్‌ విధానంలో జరుగుతుంది)
☛ జేఈఈ మెయిన్‌ (సెషన్‌-1) - 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు (ఇది కంప్యూటర్‌ ఆధారిత విధానంలో జరిగే పరీక్ష)
☛ జేఈఈ మెయిన్‌ (సెషన్‌-2) - 2024 ఏప్రిల్‌ 1 నుంచి 15 వరకు (ఇది కంప్యూటర్‌ ఆధారిత విధానంలో జరిగే పరీక్ష)
☛ సీయూఈటీ- యూజీ - మే 15 నుంచి 31 వరకు (ఇది కంప్యూటర్‌ ఆధారిత విధానంలో జరిగే పరీక్ష)
☛ సీయూఈటీ - పీజీ : మార్చి 11 నుంచి 28 వరకు (ఇది కంప్యూటర్‌ ఆధారిత విధానంలో జరిగే పరీక్ష)
☛ యూజీసీ నెట్‌ (సెషన్‌-1)- 2024 జూన్‌ 10 నుంచి 21 వరకు (ఇది కంప్యూటర్‌ ఆధారిత విధానంలో జరిగే పరీక్ష)

☛ జేఈఈ మెయిన్​ 2024: jeemain.nta.nic.in.
☛ నీట్​ యూజీ 2024: neet.nta.nic.in.
☛ సీయూఈటీ యూజీ 2024: cuet.samarth.ac.in.
☛ సీయూఈటీ పీజీ 2024: cuet.nta.nic.in.
☛ యూజీసీ నెట్​ 2024: ugcnet.nta.nic.in.

#Tags