Dr Beeraiah Baire: ఐఐటీ జామ్‌కు సన్నద్ధం కావాలి

కరీంనగర్‌ సిటీ: విద్యార్థులు శాసీ్త్రయ అవగాహనతో నిరంతరం సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని ఎస్సారార్‌ కళాశాల పూర్వ విద్యార్థి, ప్రస్తుత ఐఐటీ మద్రాస్‌ ప్రొఫెసర్‌ బీరయ్య బైరి అన్నారు.
ఐఐటీ జామ్‌కు సన్నద్ధం కావాలి

కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీలో రసాయన శాస్త్ర విభాగం, కళాశాల అలుమ్ని అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఐఐటీ జామ్‌, గేట్‌పై అక్టోబ‌ర్ 4న‌ అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఐఐటీ లాంటి జాతీయ స్థాయి సంస్థల్లో మాస్టర్స్‌ కోర్సు చేయడానికి నేటి నుంచే జామ్‌కు సన్నద్ధం కావాలని పేర్కొన్నారు.

చదవండి: Amzath Basha: ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ ఆదర్శవంతంగా ఉండాలి

పరీక్షకు సంబంధించిన అర్హతలు, పరీక్షా విధానం, అందుబాటులో ఉన్న కోర్సుల వివరాలను తెలియచేశారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ ఎం.హిమబిందు మాట్లాడుతూ.. ప్రొఫెసర్‌ బీరయ్యలాగే అత్యున్నత స్థాయిని చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో రసాయన శాస్త్ర విభాగం అధ్యాపకులు కె.భాస్కర్‌, జి.శ్రీనివాస్‌, మహిపాల్‌ రెడ్డి, సాయి మధుకర్‌, కళాశాల అలుమ్ని అసోసియేషన్‌ సెక్రటరీ, రాష్ట్ర టీజీసీజీటీఏ సెక్రటరీ సురేందర్‌ రెడ్డి, ట్రెజరర్‌ షుకుర్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.
 

#Tags