Job Fair: సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగావకాశాలు

విద్యానగర్‌(కరీంనగర్‌): ఇంటర్‌ చదివిన విద్యార్ధులకు హెచ్‌సీఎల్‌ టెక్‌బీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగావకాశాలు ఉన్నాయని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి జగన్‌మోహన్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

ఇందుకోసం ఆగ‌స్టు 8న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో జరిగే ఈ జాబ్‌మేళాలో 2023–2024 విద్యా సంవత్సరంలో ఇంటర్‌లో 75శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు. వివరాలకు హెచ్‌సీఎల్‌ ప్రతినిధిని సెల్‌నంబరు 75691 77071లో సంప్రదించాలని సూచించారు.

చదవండి:

NHAI Contract Jobs : ఎన్‌హెచ్‌ఏఐలో ఒప్పంద ప్రాతిప‌దిక‌న వివిధ పోస్టుల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు.. వివ‌రాలు ఇలా!

Scientist B Posts : బీఐఎస్‌లో సైంటిస్ట్-బీ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు..

#Tags