National Fire Service College: ఫైర్‌ ఇంజనీరింగ్‌తో ఉద్యోగావకాశాలు.. ఈ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు

సాక్షి, హైదరాబాద్‌: బీటెక్‌ ఫైర్‌ ఇంజనీరింగ్‌ అభ్యసించే వారికి అద్భుత ఉపాధి అవకాశాలున్నాయని ఫైర్‌ సర్వీసెస్‌ ఉన్నతాధికారులు తెలిపారు.

నాగ్‌పూర్‌లోని నేషనల్‌ ఫైర్‌ సర్వీసెస్‌ కాలేజీ (ఎన్‌ఎఫ్‌ఎస్‌సీ)లో ఈ బీటెక్‌ కోర్సుకు సంబంధించి 60 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. జేఈఈ మెయిన్స్‌లో ఆలిండియా ర్యాంకుల ఆధారంగా మెరిట్‌ విద్యార్థులకు ఇందులో ప్రవేశాలు కల్పిస్తున్నారు.

ఎన్‌ఎఫ్‌ఎస్‌సీలో ఫైర్‌ ఇంజనీరింగ్‌ చేసిన విద్యార్థులు ఓఎన్‌జీసీ, గెయిల్, సెయి­ల్, ఐవోసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, రిలయన్స్, టాటాపవర్, వేదాంత, డీఎల్‌ఎఫ్‌ వంటి కంపెనీల్లో ప్లేస్‌మెంట్లు పొందారు. వీరిలో ఏటా రూ.22 లక్షల వేతనంతో ప్యాకేజీ వచ్చిన వారున్నట్టు అధికారులు తెలిపారు.

చదవండి: Fire Safety: అగ్ని ప్రమాదం.. మంటలను ఆర్పేందుకు ఉపయోగించే ర‌కాలు ఇవే..!

క్యాంపస్‌ నియామకాలతో పాటు డీఆర్‌డీవో, బీఏఆర్‌సీ వంటి సంస్థల్లో ఫైర్‌ సేఫ్టీ విభాగంలో పలు అవకాశాలున్నట్టు పేర్కొన్నారు.

ఎన్‌ఎఫ్‌ఎస్‌సీ బీటెక్‌ ఫైర్‌ ఇంజనీరింగ్‌కు ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ జూలై 2 అని తెలిపారు. వివరాలకు ఎన్‌ఎఫ్‌ఎస్‌సీ వెబ్‌సైట్‌తోపాటు 8983300060, 0712–2982225 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. 

#Tags