NHPC Recruitment 2024: ఇంజనీరింగ్ పూర్తిచేశారా? NHPCలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
NHPC Recruitment 2024: ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్. షనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHPC)లిమిటెడ్‌లో 280 ట్రైనీ ఇంజనీర్, ట్రైనీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 280
ఖాళీల వివరాలు:
ట్రైనీ ఇంజినీర్ (సివిల్) : 95 పోస్టులు
ట్రైనీ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) : 75 పోస్టులు
ట్రైనీ ఇంజినీర్ (మెకానికల్) : 77 పోస్టులు
ట్రైనీ ఇంజినీర్ : 04 పోస్టులు
ట్రైనీ ఇంజినీర్ & ట్రైనీ ఆఫీసర్ (ఐటీ) : 20 పోస్టులు
ట్రైనీ ఇంజినీర్ & ట్రైనీ ఆఫీసర్ (ఎన్విరాన్మెంట్) : 06 పోస్టులు
ట్రైనీ ఆఫీసర్ (జియోలజీ) : 03 పోస్టులు
అర్హత: సంబంధిత పోస్టును బట్టి బీఎస్ఈ, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 30 ఏళ్లకు మించరాదు.
ఎంపిక విధానం: అభ్యర్థులను గేట్-2023 స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 26, 2024
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ https://www.nhpcindia.com/ను సంప్రదించండి.