Gurukul Students in EAPCET: ఈఏపీ సెట్‌లో ఉత్త‌మ ర్యాంకులు సాధించిన బాలుర‌ గురుకుల విద్యార్థులు..

ప్రభుత్వ సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ(సీఓఈ) కళాశాల విద్యార్థులు ఈఏపీ సెట్‌లో ఉత్త‌మ ర్యాంకులు సాధించారు..

బెల్లంపల్లి: ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన ఈఏపీ సెట్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాల్లో బెల్లంపల్లి ప్రభుత్వ సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ(సీఓఈ) కళాశాల విద్యార్థులు ర్యాంకులు సాధించారు. శనివారం ఈఏపీ సెట్‌ ఫలితాలు వెలువడ్డాయి. బైపీసీ విభాగంలో 24 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 23 మంది అర్హత సాధించారు.

Group I Exam: గ్రూప్‌ –1 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి

జుమ్మిడి ప్రణయ్‌ 4,885వ ర్యాంకుతో కళాశాల టాపర్‌గా నిలువగా, ఎం.శివకృష్ణ 7,123వ ర్యాంకు, యార్కర్‌ నికిత్‌ 17,928వ ర్యాంకు, గోమాస అఖిల్‌ 18,578వ ర్యాంకు సాధించారని ప్రిన్సిపాల్‌ ఐనాల సైదులు ప్రకటించారు.

ఎంపీసీ విభాగంలో 38 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 37 మంది అర్హులయ్యారు. వీరిలో వెలుతురు అఖిల్‌ 17,133వ ర్యాంకుతో కళాశాల టాపర్‌గా నిలిచాడు.

విద్యార్థులను ప్రిన్సిపాల్‌ సైదులు, అధ్యాపకులు పిన్నింటి కిరణ్‌, శ్రీరామవర్మ, మిట్ట రమేష్‌, చందా లక్ష్మీనారాయణ, శోభ, కట్ల రవీందర్‌, అనుముల అనిరుధ్‌ అభినందించారు.

 

#Tags