TS EAPCET Answer Key 2024 Out Now: టీఎస్ ‌ఎంసెట్‌ ప్రాథమిక కీ విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

తెలంగాణ ఈఏపీసెట్‌ (EAPCET) 2024 అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ స్ట్రీమ్‌ పరీక్షల ప్రిలిమినరి కీ విడుదల అయ్యింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు మే 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ప్రిలిమినరీ కీతో పాటు రెస్పాన్స్‌ షీట్‌, మాస్టర్‌ ప్రశ్నపత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు హాల్‌టికెట్‌ నెంబర్‌, రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, పుట్టినరోజు వివరాలతో ప్రిలిమినరి కీ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

 కీపై అభ్యంతరాలు ఉంటే మే 13వ తేదీ ఉదయం 11 గంటలలోగా తెలియజేయాలి. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మే 7, 8 తేదీల్లో ఈఏపీసెట్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ విభాగానికి సంబంధించిన పరీక్షలు జరగిన విషయం తెలిసిందే.

TSRTC: ఇకపై జీన్స్, టీషర్ట్స్‌ వేసుకురావొద్దు.. ఆర్టీసీ కీలక ఆదేశాలు

తర్వాత మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్‌ పరీక్షలు జరిగాయి. రేపు(ఆదివారం) ఎంసెట్‌ విభాగానికి సంబంధించిన ప్రిలిమినరీ కీ విడుదల కానుంది. పూర్తి సమాచారం కోసం అఫీషియల్‌ వెబ్‌సైట్‌  https://eapcet.tsche.ac.in/ ను సంప్రదించండి. 

TS EAPCET Answer Key 2024.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

  • ముందుగా అఫీషియల్‌ వెబ్‌సైట్‌ https://eapcet.tsche.ac.in/ను క్లిక్‌చేయండి.
  • హోంపేజీలో కనిపిస్తున్న EAPCET Answer Key లింక్‌పై క్లిక్‌ చేయండి
  • credentials ఎంటర్‌ చేసి submit అనే బటన్‌పై క్లిక్‌ చేయండి
  • స్క్రీన్‌పై ఆన్సర్‌ కీ కనిపిస్తుంది.. డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

 

#Tags