TG EAPCET-2024: ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవే శానికి కౌన్సెలింగ్ ఈ నెల 27 నుంచి ప్రారంభం.... కాలేజీల గుర్తింపు ఆలస్యం!
హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవే శానికి నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది. అయితే కాలేజీ ల్లో తనిఖీలు పూర్తి అయినా విశ్వవిద్యాలయాలు తమ పరిధిలోని కాలేజీలకు ఇప్పటివరకూ అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. ఇది వస్తే తప్ప కౌన్సెలింగ్‌లో పాల్గొనే కాలేజీలు సీట్ల వివరాలు వెల్లడించడం సాధ్యం కాదు. కౌన్సెలింగ్ వెబ్‌సైట్‌లో కాలేజీలు, కోర్సుల వివరాలు ఉంటేనే విద్యార్థులు కూడా ఆప్షన్లు ఇవ్వగలుగుతారు. నిజానికి ప్రతి ఏటా ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. రాష్ట్రంలోని అన్ని కా లేజీలు, కోర్సులు తొలి కౌన్సెలింగ్‌లో అందుబా టులో ఉండకపోవడం సర్వసాధారణంగా మారింది. దీనివల్ల విద్యార్థులు గందరగోళానికి గురవుతు న్నారు. ఈ ఏడాది ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీజీ ఈఏపీ సెట్–2024)లో అర్హత సాధించిన వారంతా 27వ తేదీన కౌన్సెలింగ్‌కు రిజిసే్ట్రషన్ చేసుకోవా లి. 30వ తేదీ నుంచి ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది.
ఏటా ఆలస్యమే
రాష్ట్రంలో 178 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. ఇందులో 17 కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలోని విశ్వవి ద్యాలయాల పరిధిలో ఉన్నాయి. మిగిలిన 161 కాలేజీలు ప్రైవేటువి. ఇవి ఇంజనీరింగ్ బ్రాంచ్‌లు, సెక్షన్లు, సీట్లకు సంబంధించి ముందు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతి తీసుకోవాలి. ఈ మేరకు 33 కాలేజీలు మినహా అన్నీ అనుమతి తీసుకున్నాయి. ఏఐసీటీ ఈ అనుమతి తీసుకున్న 128 కాలేజీలు తన పరిధిలోని విశ్వవిద్యాలయం నుంచి గుర్తింపు పొందాల్సి ఉంటుంది. తగిన సంఖ్యలో బోధన సిబ్బంది, అవసరమైన మౌలిక వసతులు ఉన్నాయా? అనే అంశాన్ని పరిశీలించి అనుమతులిస్తాయి. ఏటా ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది.
Also Read: డీఎస్సీకి 2.79 లక్షల దరఖాస్తులు.. వీరికి డీఎస్సీలో
తనిఖీలు పూర్తయినా
ఈ ఏడాది పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. వీసీల పదవీ కాలం మే 21తో ముగిసింది. ఈలోగానే తనిఖీలు పూర్తి చేశారు. గుర్తింపు ఇవ్వడానికి అన్ని అర్హతలూ ఉన్నాయని వీసీలు నిర్థారించారు. అయితే తనిఖీ బృందాల వైఖరిపై ప్రభుత్వానికి కొందరు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలోనే అనుబంధ గుర్తింపు జారీని నిలిపివేశారు. ఆ తర్వాత పది వర్సిటీలకు ఐఏఎస్‌లు వీసీలుగా వచ్చారు. వీరు ప్రస్తుతం ప్రతి కాలేజీ వివరాలు తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
సీట్ల లెక్క తేలెదెప్పుడు?
రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో మొత్తం 1.22 లక్షల సీట్లున్నాయి. ఇందులో 83 వేల సీట్లు కన్వీ నర్ కోటా కింద ఉన్నాయి. వీటిల్లో 58 శాతం కంప్యూటర్ సైన్ ్స ఇంజనీరింగ్, ఇతర కంప్యూటర్ కోర్సుల్లో ఉన్నాయి. డిమాండ్ లేని సివిల్, మెకాని కల్, ఎలక్ట్రికల్ బ్రాంచ్‌ల్లో సీట్లను, సెక్షన్లను ప్రైవే టు కాలేజీలు తగ్గించుకుంటున్నాయి. వీటి స్థానంలో కంప్యూటర్ సైన్ ్స బ్రాంచీల్లో సీట్లు పెంచమని కోరుతున్నాయి. ఈ ఏడాది కూడా ఈ విధంగా 80 కాలేజీల నుంచి దరఖాస్తులు వచ్చాయి.
Tags
- TG EAPCET-2024 Engineering Counselling
- Engineering Counselling 2024
- TG EAPCET-2024
- TG EAPCET-2024 Counselling News
- Sakshi Education News
- TSCHE Chairman about engineering counselling
- v
- counselling process and guidance
- engineering colleges
- selection of college and course in engineering
- College affiliation recognition process
- Seat details counseling
- College counseling 2024
- Hyderabad engineering admissions