TS EAPCET 2024 Notification: ఈసారి ఏ కోర్సులు ఉన్నాయంటే..

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి.. తెలంగాణ స్టేట్‌ ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2024(ఈఏపీసెట్‌) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షను జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్శిటీ హైదరాబాద్‌(జేఎన్‌టీయూహెచ్‌) నిర్వహించనుంది. దీని ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలో యూనివర్శిటీలు, ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్, అఫిలియేటెడ్‌ ప్రొఫెషనల్‌ కళాశాలల్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

కోర్సుల వివరాలు
బీఈ, బీటెక్‌/బీటెక్‌(బయో-టెక్నాలజీ)/బీటెక్‌(డెయిరీ టెక్నాలజీ) /బీటెక్‌(అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌)/బీఫార్మసీ/బీటెక్‌(ఫుడ్‌ టెక్నాలజీ)/బీఎస్సీ(ఆనర్స్‌) అగ్రికల్చర్‌/బీఎస్సీ(ఆనర్స్‌) హార్టికల్చర్‌/బీఎస్సీ(ఫారెస్ట్రీ/బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌/బీఎఫ్‌ఎస్సీ; ఫార్మ్‌-డి; బీఎస్సీ(నర్సింగ్‌).
అర్హత: ఇంటర్మీడియట్‌(ఎంపీసీ/బైపీసీ)లో ఎస్సీ, ఎస్టీలకు 40%, ఇతరులకు 45% మార్కులు తప్పనిసరిగా ఉండాలి.

పరీక్ష కేంద్రాలు: ఎంసెట్‌ నిర్వహణకు తెలంగాణలో 16 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు నగరాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు.

చదవండి: Guidance

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులకు చివరితేది: 06.04.2024.
దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం: 08.04.2024 నుంచి 12.04.2024 వరకు
హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడ్‌ తేది: 01.04.2024 నుంచి 
ఈఏపీసెట్‌ పరీక్షలు: 09.05.2024, 10.05.2024 తేదీల్లో ఇంజనీరింగ్, 11.05.2024, 12.05.2024 తేదీల్లో అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ పరీక్షలు జరుగుతాయి.

వెబ్‌సైట్‌: https://eapcet.tsche.ac.in/

చదవండి: Best Branches for EAMCET Counselling: బీటెక్‌లో బ్రాంచ్, కాలేజ్‌ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

#Tags