TS EAMCET Preliminary Key 2023 : ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ‘కీ’ విడుదల.. అలాగే ఫ‌లితాల‌ను కూడా ఎప్పుడు విడుద‌ల చేస్తారంటే..?

TS EAMCET 2023 Engineering key

అలాగే ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలకు సంబంధించి విద్యార్థుల రెస్పాన్స్‌ పత్రాలను సైతం వెబ్‌సైట్‌లో ఉంచారు. 

చదవండి: బీటెక్‌లో ఈఈఈతో భవిష్యత్తుకు భరోసా ఉంటుందా.. తెలుసుకోండిలా..

మే 12-14 మధ్య ఎంసెట్ (ఇంజినీరింగ్) పరీక్షలు జరగిన విష‌యం తెల్సిందే. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషన్ పరీక్ష, మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు రెండవ సెషన్ పరీక్షల‌ను నిర్వ‌హించారు. ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షకు మొత్తం 2,05,351 మంది దరఖాస్తులు చేసుకోగా.. 1,95,275మంది(94.11శాతం) పరీక్షలు రాసినట్టు ఎంసెట్‌ కన్వీనర్‌ కార్యాలయం వెల్లడించింది.

☛➤ తెలంగాణ ఎంసెట్ 2023 (ఇంజ‌నీరింగ్) ప్రాథ‌మిక 'కీ' కోసం క్లిక్ చేయండి

తెలంగాణ ఎంసెట్ (ఇంజ‌నీరింగ్ ) ప్రాథ‌మిక 'కీ' లో అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు మే 17వ తేదీ రాత్రి 8గంటల వరకు తెలపవచ్చు.

ఎంసెట్ ఫ‌లితాలు ఎప్పుడంటే..?

టీఎస్ ఎంసెట్ పరీక్షలు ముగిసిన రెండు వారాల్లో ఫలితాలను ప్రకటిస్తారు. ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజీ లేకపోవడంతో ఇంటర్‌, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ ఫలితాల కోసం వేచిచూడాల్సిన అవసరం లేదు. విద్యార్థుల ఎంసెట్‌ మార్కుల ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తారు. త్వ‌ర‌లోనే తుది ‘కీ’ని వెల్లడించి.. ఫలితాల ప్రక్రియను ప్రారంభించ‌నున్నారు.

☛ Engineering‌ Admissions: బీటెక్‌లో ప్రవేశాలకు సిద్ధమవుతున్నారా... అయితే ఇది మీ కోస‌మే!

ఎక్కువ‌గా ఇంజ‌నీరింగ్ వైపే ఎందుకంటే..
జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశానికి జేఈఈ రాయాల్సి ఉంటుంది. ఇందులో ర్యాంకు రావాలంటే బాగానే కష్టపడాలి. ముమ్మర కోచింగ్‌ తీసుకోవాలి. ఇంతా చేసి సాధారణ ర్యాంకు వస్తే కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల్లో సీట్లు లభించడం కష్టం. ఈ కారణంగానే ఇంటర్‌ ఉత్తీర్ణుల్లో సగానికిపైగా జేఈఈ వైపు వెళ్ళడం లేదు. 

ఎలాగైనా కంప్యూటర్‌ సంబంధిత ఇంజనీరింగ్‌ కోర్సు చేయాలనుకుంటున్న వారు ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఎంసెట్‌కు 3 లక్షల మంది దరఖాస్తు చేస్తే, జేఈఈకి 1.40 లక్షల మందే దరఖాస్తు చేయడం గమనార్హం.

చదవండి: బీటెక్‌లో ఈసీఈతో బంగారు భవిత అందుకోండి.. కెరీర్‌లో దూసుకెళ్లండి..

ఇంజనీరింగ్‌ కాలేజీలు కూడా..
మరోవైపు విద్యార్థుల అభిమతానికి అనుగుణంగా రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీలు కూడా ట్రెండ్‌ మార్చాయి. సంప్రదాయ కోర్సులైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రి కల్‌ విభాగాల్లో సీట్లు తగ్గించుకుంటున్నాయి. వీటి స్థానంలో సీఎస్‌సీ, డేటా సైన్స్, సైబర్‌ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి కోర్సుల్లో సీట్లు పెంచుకుంటున్నాయి. 

చదవండి: ఎవర్‌గ్రీన్ సివిల్ ఇంజనీరింగ్.. కెరీర్ అవకాశాలు ఇలా..

దీంతో ఎంసెట్‌లో అర్హత సాధిస్తే ఏదో ఒక కాలేజీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు అనువైన కంప్యూటర్‌ కోర్సు సీటు వస్తుందని విద్యార్థులు భావిస్తున్నారు.ఎంసెట్‌కు దరఖాస్తులు పెరగడానికి ఇది కూడా ఒక కారణమని అధికార వర్గాలు చెబుతున్నాయి.

TS EAMCET 2023 Marks Vs Rank :

#Tags