Good News For Vidya Volunteers : విద్యావాలంటీర్లకు గుడ్‌న్యూస్‌.. మెగా డీఎస్సీకి..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణలోని విద్యావాలంటీర్లను వచ్చే విద్యా సంవత్సరంలో రెన్యూవల్ చేస్తామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు.

డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఏర్పాట్లు  చేస్తున్నామని చెప్పారు. మెగా డీఎస్సీ కోసం సత్వరమే చర్యలు తీసుకోవాలనీ.., ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకూ విద్యావాలంటీర్లను రెన్యువల్ చేయాలంటూ టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి రియాజ్, పీసీసీ మీడియా కో-ఆర్డినేటర్ కమలాకర్, టీవీవీఎస్ వ్యవస్థాపకులు, డీఎస్సీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మఠం శివానంద స్వామి జ‌న‌వ‌రి 24వ తేదీన (బుధవారం) బుర్రా వెంకటేశంను కలిసి విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల్లోపు డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయాలని కోరారు. పర్సెంటేజ్ నిబంధనతో చాలామంది అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, ఆ సమస్య లేకుండా నోటిఫికేషన్ ఇవ్వాలని సూచించారు.

☛ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

వీలైనన్ని అధిక సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ కోసం చర్యలు తీసుకుంటున్నామని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు. త్వరలోనే అనుబంధ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామన్నారని పేర్కొన్నారు.

☛ Telangana Job Calendar 2024 Details : ఈ ఏడాది ప్ర‌భుత్వ ఉద్యోగాల నోటిఫికేష‌న్ల వివ‌రాలు ఇవే.. వివిధ శాఖ‌ల్లోని పోస్టులు ఇవే..

టీచర్‌ కొలువుకు తొలిమెట్టు.. టెట్‌లో అర్హత సాధించే ప్రణాళిక ఇదిగో..!

తెలంగాణ‌లో ప్ర‌భుత్వ టీచ‌ర్ ఉద్యోగాల భ‌ర్తీకి ఆల‌స్యం అయ్యేలా క‌నిపిస్తోంది. క‌నుగ తెలంగాణ ప్రభుత్వ స్కూల్స్‌లో వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం రోజు నుంచే విద్యా వాలంటీర్స్ అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇందుకోసం ప్రస్తుత ఖాళీల ప్రకారం దాదాపు 15 వేల మందిని నియమించే అవకాశం ఉంది. 

జూన్‌ 11వ తేదీ నాటికి.. 

ఒక్క ఖాళీ లేకుండా విద్యా వాలంటీర్లను భర్తీ చేయాలని ఇటీవల ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది. డీఎస్సీ ద్వారా శాశ్వత ఉపాధ్యాయుల నియామకానికి 6 నుంచి 9 నెలల సమయం పడుతుందన్న అంచనా నేపథ్యంలో జూన్‌ 11వ తేదీ నాటికి విద్యా వాలంటీర్ల ఎంపికను పూర్తి చేయాలని భావిస్తున్నారు. శాశ్వత ఉపాధ్యాయులు విధుల్లో చేరే వరకు విద్యా వాలంటీర్లు పనిచేయనున్నారు.

☛ Volunteer Jobs in Telangana : ఏపీ త‌ర‌హాలో.. తెలంగాణలో కూడా 80000 వలంటీర్ల ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..!

నెల‌కు రూ.15000 నుంచి రూ.20000 మ‌ధ్య‌లో జీతం..?
గతంలో పాఠశాలల పునఃప్రారంభం తర్వాత ఎంపిక ప్రక్రియ మొదలయ్యేది. దానివల్ల 15-30 రోజులపాటు బోధన కుంటుపడేది. ఈ సారి ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుగానే.. విద్యా వాలంటీర్ల ఉద్యోగాల‌ను నియ‌మించుకోనున్నారు. నాలుగేళ్ల క్రితం వరకు వీరికి నెలకు రూ.12 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించారు. ఈ సారి విద్యా వాలంటీర్లు రెవంత్‌రెడ్డి సర్కార్ రూ.15000 నుంచి రూ.20000 మ‌ధ్య‌లో జీతం ఇచ్చే అవ‌కాశం ఉంది.

#Tags