Good News for DSC Candidates 2008 : డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వీళ్లకు ప్రత్యేకంగా ఉద్యోగాలు.. ఇంకా..
కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయవిచారణకు కేబినేట్ నిర్ణయం తీసుకుంది. దీని విచారణ కమిటీ చైర్మన్‌గా జస్టిస్ పీసీ చంద్రఘోష్ ఎంపిక చేశారు.
అర్హులైన పేదలకు..
అలాగే అత్యంత ముఖ్యమైన నూతన రేషన్ కార్డుల జారీకి కేబినేట్ అమోదం తెలిపింది. అర్హులైన పేదలకు తెల్ల రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం 22,500 కోట్లు కేటాయింపుకు కేబినెట్ సమావేశంలో అమోదం తెలిపింది. 14 బీసీ కార్ఫోరేషషన్‌ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ లకు నూతన ప్రత్యేక కార్పోరేషన్ ల ఏర్పాటు చేయనున్నారు.
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్..
అలాగే 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని కేబినేట్ మరో కీలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చినట్లు ఇవ్వాలని నిర్ణయించారు. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టులు, విద్యుత్ కొనుగోళ్ల అంశంపై విశ్రాంత జడ్జి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణకు కేబినెట్ నిర్ణయం. రెండు రోజుల్లో 93శాతం రైతు బంధు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.