TG DSC 2024 Ranker Success Story : ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో చ‌దివి.. టీచ‌ర్ ఉద్యోగం కొట్టానిలా... నా భార్య కూలీ చేసి.. !

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవ‌లే డీఎస్సీ-2024 ఫ‌లితాల‌ను విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. ఈ ఫ‌లితాల్లో ఎంద‌రో... పెదింటి వారు త‌మ స‌త్తాచాటారు. ఈ నేప‌థ్యంలో డీఎస్సీ ర్యాంక‌ర్లు స‌క్సెస్ స్టోరీలు మీకోసం...

ఇంటి దగ్గర ఆన్‌లైన్‌ యాప్‌లలో వింటూ... మొద‌టి ర్యాంక్ సాధించా..
నాపేరు స్వప్న. మా నాన్న సత్యారెడ్డి. మా అమ్మ కమలమ్మ. మాది తెలంగాణ‌లోని నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలంలోని జక్లేర్‌ స్వగ్రామం. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదలి బీఎడ్‌ చేశాను. ఇంటి దగ్గర ఆన్‌లైన్‌ యాప్‌లలో వింటూ డీఎస్సీకి సన్నద్ధమయ్యాను. రాత్రి 12 గంటల వరకు చదివేదాన్ని. నా ప్రిప‌రేష‌న్ టైమ్‌లో నా భర్త, మా అత్తమ్మ ఎంతో సహకరించారు. నారాయణపేట జిల్లా స్థాయిలో గణితంలో 87.33 మార్కులు సాధించి మొదటి ర్యాంకు సాధించా.

☛➤ TG DSC Rankers Success Stories : విచిత్రంగా రిటైర్మెంట్ రోజే... కొడుకు, కోడ‌లు ఒకేసారి ప్ర‌భుత్వ టీచ‌ర్ ఉద్యోగాలు కొట్టారిలా.. కానీ...

నా భార్య నా కోసం కూలీ ప‌ని చేసి న‌న్ను చ‌దివించింది...

నా పేరు కబులసాబ్‌. మాది జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన అమరవాయి గ్రామం. నేను ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో చదివాను. గతంలో తెలుగు జూనియర్‌ లెక్చరర్‌, పీఈటీ, ఈజీటీ పోస్ట్‌లను ఒకేసారి సాధించాను. మళ్లీ డీఎస్సీ రాయగా స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగులో 79.5 మార్కులు జోగుళాంబ జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించాను. అలాగే లాంగ్వేజ్‌ పండిట్‌ తెలుగులో 80 మార్కులతో జిల్లా మొదటి ర్యాంక్‌ సాధించాను. మా అన్న అహ్మద్‌బాషా సహకారం అందించారు. అమ్మతో పాటు నా భార్య కూలీ చేసి చదివించారు.

➤☛ Success Story : ఇలా చ‌దివి ఎలాంటి కోచింగ్ లేకుండానే.. ఒకే సారి 3 ప్ర‌భుత్వ ఉద్యోగాలు సాధించా.. నా ల‌క్ష్యం ఇదే...

#Tags