TG DSC Ranker Success Story 2024 : పేదరికంతో పోరాటం చేస్తూ... అనుకున్న ప్ర‌భుత్వ టీచ‌ర్ ఉద్యోగం సాధించానిలా.. కానీ..

తెలంగాణ ప్ర‌భుత్వం ఇటీవ‌ల విడుద‌ల చేసిన‌ డీఎస్సీ ఫ‌లితాల్లో ఎంతో మంది త‌మ ప్ర‌తిభ చాటి గ‌వ‌ర్న‌మెంట్ టీచ‌ర్ ఉద్యోగాలు సాధించారు. తల్లిదండ్రుల కష్టాన్ని చూసి కొందరు.. గురువుల ప్రోత్సాహంతో ఇంకొందరు.. అన్నదమ్ముల ఆదర్శంతో మరికొందరు .. ఇలా ఎంద‌రో ఎట్ట‌కేల‌కు అనుకున్న ప్ర‌భుత్వ టీచ‌ర్‌ ఉద్యోగాలు సాధించారు.

కొంద‌రు ఆడ‌పిల్ల‌లు అయితే పుట్టినిల్లు, మెట్టింటి వారి సహకారంతో.. పట్టుదలతో చదివి డీఎస్సీలో కొలువు సాధించారు. అలాగే వీరు ఇటీవ‌లే నియామక పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా.. డీఎస్సీలో మంచి మార్కులతో ఉద్యోగం సాధించిన‌... కొంద‌రి స‌క్సెస్ స్టోరీలు మీకోసం..

కుటుంబ నేప‌థ్యం :
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని నిమ్మపల్లికి చెందిన మరియాల కార్తీక్‌ ఉన్నత కుటుంబంలో పుట్టినా పరిస్థితుల ప్రభావంతో పేదరికంలోకి నెట్టివేయబడి కష్టాలను అనుభవించాడు. తల్లి లలిత అనారోగ్యంతో మృతిచెందగా తండ్రి రాజబాబు బీడీ కంపెనీ టేకేదారుగా పనిచేస్తూ పోషించాడు.

☛➤ TG DSC Topper Success Story : రిక్షా తొక్కి వ‌చ్చిన డ‌బ్బుతో నా కొడుకుని చ‌దివించానిలా... కానీ...

విద్యావలంటీర్‌గా పనిచేస్తూనే..
విద్యావలంటీర్‌గా పనిచేస్తూనే డిగ్రీ పూర్తి చేశాడు. దూరవిద్యలో ఎంఏ తెలుగు చేసి, మొదటిసారి డీఎస్సీ రాయగా ఎంపిక కాలేదు. బీడీ కంపెనీ చూసుకుంటూనే రెండో ప్రయత్నంలో జిల్లాలో రెండో ర్యాంకుతో టీచర్‌ ఉద్యోగం సాధించాడు. తన విజయానికి తండ్రి, భార్య సహకారం మరువలేనిదని కార్తీక్‌ పేర్కొన్నాడు. కార్తీక్‌ భార్య స్వప్న, ఇద్దరు పిల్లలు అన్విక, అధితి ఉన్నారు. కార్తీక్‌కు చిన్నప్పటి నుంచి టీచర్ జాబ్ అంటే ఎంతో ఇష్టంతో అనుకున్న ల‌క్ష్యంను ఎట్ట‌కేల‌కు సాధించుకున్నాడు.

➤☛ ఒకేసారి మేము ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాం ఇలా.. మా చిన్నప్పుడే నాన్న‌ చనిపోయినా.. మా అమ్మ...

మా అన్నను...

అన్నను ఆదర్శంగా తీసుకొని పట్టుదలతో స్కూల్‌ అసిస్టెంట్‌ (ఇంగ్లిష్‌లో జిల్లా మొదటి ర్యాంకు) ఉద్యోగం సాధించాడు ఇబ్రహీంపట్నం మండలం కొజన్‌కొత్తూర్‌కు చెందిన ఐతే రవికుమార్‌. అన్న మహేందర్‌ సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఉద్యోగి. తాను కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని రవికుమార్‌ గత జూన్‌లో గురుకుల పరీక్ష రాసి టీజీటీ (ఇంగ్లిష్‌) ఉద్యోగం సాధించి జ్యోతిబాపూలే నిజామాబాద్‌ జిల్లా మొర్తాడ్‌లో పని చేస్తున్నాడు. ఈ సంద‌ర్భంగా సీఎం చేతుల మీదుగా నియామక ప‌త్రం తీసుకోవ‌డం ఆనందంగా ఉందని రవి పేర్కొన్నాడు.

➤☛ TG DSC 2024 Ranker Success Story : ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో చ‌దివి.. టీచ‌ర్ ఉద్యోగం కొట్టానిలా... నా భార్య కూలీ చేసి.. !

#Tags