Teacher Jobs: ఈ టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి
ఎన్నికల ముందు సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు స్టూడెం ట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్, డీఎస్సీ ఉర్దూ అభ్యర్థుల ఆధ్వర్యంలో నవంబర్ 25న ఇందిరాపార్కు వద్ద నిర సన వ్యక్తం చేశారు.
చదవండి: AAPAR Card Problems : అపార్ కార్డుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు అనేక ఇబ్బందులు
ఈ సందర్భంగా స్టూడెంట్ ఇస్లా మిక్ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఫైజల్ ఖాన్, క్యాంపు కార్యదర్శి తాజ్, సామాజిక కార్యకర్త ఖలీదాఫర్వీన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1,183 ఉర్దూ ఉపా ధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే ఇటీవల ప్రకటించినచిన డీఎస్సీలో కేవలం 570 పోస్టులను భర్తీ చేసి మిగతా 666 పోస్టులను డీఎస్సీ అభ్యర్థులు ఉన్నప్ప టికీ భర్తీ చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు.
ఉర్దూ మీడియంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుందని అన్నారు. ఎన్నికల సమయంలో నాయకులు తమ ప్రాంతాలకు వచ్చి ఉర్దూలో మాట్లాడటం, టోపీ పెట్టుకోవడం వంటివి చేస్తారే తప్పా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఎస్సీ అభ్యర్థులు సభా అజీజ్, కైసర్ పాషా, మహ్మద్ ఖలీద్, కతీజా బేగంతోపాటు అధిక సంఖ్యలో డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు.