TG DSC 2024: డీఎస్సీకి 2.79 లక్షల దరఖాస్తులు.. వీరికి డీఎస్సీలో..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా జూలై 17 నుంచి 31 వరకు జరిగే ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీజీ డీఎస్సీ)కి మొత్తం 2,79,956 దరఖాస్తులు వచ్చాయి.
కొత్తగా టెట్ ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి డీఎ స్సీ ఆన్‌లైన్ విధానంలో జరగనుంది. పలు సబ్జెక్టులు, ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ల పోస్టు లకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. సబ్జెక్టుల వారీగా పరీక్షల షెడ్యూల్‌ను విద్యా శాఖ ప్రకటించాల్సి ఉంది.
తెలంగాణలో ఇటీవలే టెట్ ఫలితాలు విడుదలైన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈ టెట్ ఫలితాల్లో పాస్ అయిన అభ్యర్థులకు విద్యాశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది.
తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్‌కు ఇప్పటివరకు దరఖాస్తు చేయని వారు.., తాజా టెట్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ వెబ్‌సైట్‌లో మార్పులు చేసింది.
చదవండి:
#Tags