DSC 2024 Selected Candidates: కొత్త టీచర్లలో గుబులు!.. ధ్రువీకరణపత్రాల పునఃపరిశీలన..

సాక్షి, సిటీబ్యూరో: కొత్తగా ఇటీవల నియమితులైన పలువురు టీచర్ల గుండెల్లో గుబులు పట్టుకుంది.

డీఎస్సీ–2024కి ఎంపికై న అభ్యర్థుల ధృవీకరణ పత్రాలపై ఆరోపణలు వస్తుండటంతో విద్యాశాఖ పునఃపరిశీలనకు సిద్ధమైంది. ఇప్పటికే టీచర్‌ పోస్టుల పోస్టింగ్‌లలో జరిగిన పొరపాట్ల దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన విద్యాశాఖ..తాజాగా స్పోర్ట్స్‌ కోటా కింద ఎంపికై న అభ్యర్థుల ధృవపత్రాలను పునఃపరిశీలించాలని నిర్ణయించింది.

న‌వంబ‌ర్‌ 20 నుంచి ఈ ప్రక్రియను నిర్వహించాలంటూ సర్క్యులర్‌ జారీ చేసింది. ఈ మేరకు స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులతో పాటు, ఇదే కోటాలో ఉద్యోగాలకు ఎంపికవని అభ్యర్థులకు కూడా ధృవపత్రాల పునఃపరిశీలన జరుగనుంది.

చదవండి: DEO Wife: మూడేళ్లుగా స్కూల్‌కు వెళ్లని డీఈఓ భార్య?

– డీఎస్సీ–2024 కింద ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికై న అభ్యర్థుల ధృవీకరణ పత్రాలను పరిశీలించిన అనంతరం గత నెల 9న ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ నియామక పత్రాలను అందజేశారు. అనంతరం కౌన్సిలింగ్‌ ద్వారా పోస్టింగ్‌లు కూడా ఇచ్చారు.

ఎంపికై న వారిలో కొందరు బోగస్‌ అభ్యర్థులున్నట్టు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ముందుగా స్పోర్ట్స్‌ కోటా కింద ఎంపికై న అభ్యర్థులు ధృవీకరణ పత్రాలు పునఃపరిశీలించనుంది. అనంతరం ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌, పండిట్‌ అభ్యర్థుల ధృవీకరణ పత్రాలు కూడా మళ్లీ పరిశీలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

స్పోర్ట్స్‌ కోటా కింద 84 మంది

గ్రేటర్‌ పరిధిలో స్పోర్ట్స్‌ కోటా కింద సుమారు 84 మంది అభ్యర్థులు ఎంపికై విధులు నిర్వహిస్తున్నారు. అందులో హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 71 మంది, రంగారెడ్డి జిల్లా పరిధిలో 13 మంది ఎంపికయ్యారు.

న‌వంబ‌ర్‌ 20న హైదరాబాద్‌ పరిధిలోని అభ్యర్థులకు, 21న రంగారెడ్డి జిల్లా పరిధిలోని అభ్యర్థులకు దోమల్‌గూడలోని ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కాలేజీలో ఈ ధ్రువపత్రాల పున:పరిశీలన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కోటా కింద ఎంపికై న అభ్యర్థులతో పాటు, 1:3 కింద ఎంపికై న స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థుల సర్టిఫికెట్లను తిరిగి వెరిఫై చేస్తారు. ఇప్పటికే అభ్యర్థులకు సమాచారం పంపించారు.

#Tags