DSC 2024 Certificate Verification: డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన షురూ.. వీరి జాబితా ఇంకా రాలేదు..
ఆదిలాబాద్ టౌన్: డీఎస్సీ–2024 అభ్యర్థుల సర్టిఫికెట్లను విద్యాశాఖ అధికారులు అక్టోబర్ 2న పరిశీలించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో ఎనిమిది ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు.
ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంట ల వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. జిల్లాలో డీఎస్సీ ద్వారా 324 పోస్టులను భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఎస్జీటీ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. 1:3 ప్రకా రం కౌన్సెలింగ్‌కు పిలిచారు.
చదవండి: JL Appointment Letters: 9న టీచర్ నియామక పత్రాలు.. మరి జే.ఎల్ నియామక పత్రాలు ఎప్పుడు?
మంగళవారమే ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా, ప్రభుత్వం నుంచి జాబితా రాకపోవడంతో అక్టోబర్ 2న చేపట్టారు. 119 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే స్కూల్ అసిస్టెంట్ జాబితా ఇంకా అధికారులకు చేరలేదు. గురువారం జాబితా వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియను డీఈవో ప్రణీత పర్యవేక్షించారు.
చదవండి: DSC Merit Lists: జిల్లాలకు డీఎస్సీ మెరిట్ జాబితాలు.. ఒక్కో పోస్టుకు ఇంత మంది చొప్పున ఎంపిక
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
#Tags