DSC 2024 Merit List: జిల్లాకు చేరిన డీఎస్సీ మెరిట్‌ జాబితా

నారాయణపేట రూరల్‌: డీఎస్సీ ఫలితాలకు సంబంధించి మెరిట్‌ జాబితా జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి చేరాయి.

అయితే ముందుగా సిద్ధం చేసిన జాబితాలో తప్పిదాలు జరిగాయంటూ నిలిపివేసిన అధికారులు.. అర్ధరాత్రి దాటిన తర్వాత మరో జాబితా విడుదల చేశారు. ఇదిలా ఉండగా 1:3 నిష్పత్తిలో ఎంపికై న వారికి శనివారం వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ప్రకటించడంతో ఆన్‌లైన్‌ దరఖాస్తులు నమోదు చేసిన అభ్యర్థి మొబైల్‌ నంబర్‌కు సమాచారం ఇచ్చి ధ్రువపత్రాల పరిశీలనకు రావాలని సూచించారు.

చదవండి: JL Appointment Letters: 9న టీచర్‌ నియామక పత్రాలు.. మ‌రి జే.ఎల్ నియామక పత్రాలు ఎప్పుడు?
ఈ ప్రక్రియ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని, జిల్లా రోస్టర్‌ పాయింట్ల ఆధారంగా 1:3 నిష్పత్తిలో అర్హులైన అభ్యర్థులకు ఎస్‌ఎంఎస్‌, ఈమెయిల్‌ ద్వారా సమాచారం పంపడంతోపాటు ఆ జాబితాలు డీఈఓ వెబ్‌సైట్లలోనూ అప్‌లోడ్‌ చేశారు. ఇక ఎంపికై న అభ్యర్థులు వారి విద్యార్హత ధ్రువపత్రాలు, టెట్‌, డీఎస్సీ, కుల, 17 తరగతుల స్టడీ సర్టిఫికెట్‌ (ఒరిజినల్‌)లతోపాటు రెండు సెట్ల జిరాక్స్‌ పత్రాలను తీసుకుని వచ్చి వెరిఫికేషన్‌ చేయించుకోవాల్సి ఉంది. ముఖ్యంగా పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఉంచిన ఫారాన్ని పూర్తి చేసి ఇవ్వాలి.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

శిక్షణ తర్వాతే పోస్టింగ్‌..

జిల్లావ్యాప్తంగా 279 పోస్టులకు గాను నిర్వహించిన డీఎస్సీలో పాల్గొని ఎంపికై న అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ఈ నెల 9న నియామక పత్రాలను సీఎం రేవంత్‌రెడ్డి అందజేయనున్నట్లు తెలుస్తోంది. అయితే కొత్త టీచర్లు అందరికీ తాజా పరిణామాల నేపథ్యంలో విద్యారంగంలో రానున్న విప్లవాత్మక మార్పులపై నిపుణులతో శిక్షణ ఇప్పించాలని ప్రభుత్వం భావిస్తుందని తెలుస్తోంది.
ఆ శిక్షణ తర్వాతే పాఠశాలలకు పంపించే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఏదేమైనా చాలాకాలంగా ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం త్వరలో సమస్యను పరిష్కరించి సర్కారు బడులను బలోపేతం చేయనుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.

#Tags