Indian Army Recruitment 2024: ఏఆర్‌వో సికింద్రాబాద్‌ పరిధిలో అగ్నివీర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

సికింద్రాబాద్‌లోని ఆర్మీ రిక్రూటింగ్‌ ఆఫీస్‌ అగ్నిపథ్‌ పథకం కింద 2024–25 సంవత్సరానికి సంబంధించి అగ్నివీర్‌ల ఎంపిక కోసం అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఈ నియామకాలకు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యా­ల, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబ్‌ నగర్, మెదక్, మహబూబాబాద్, మంచిర్యాల, నాగర్‌ కర్నూల్, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, ములుగు, నారాయణపేట జిల్లాలకు చెందిన అభ్యర్థులు అర్హులు.

కేటగిరీలు
అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ(ఆల్‌ ఆర్మ్స్‌); అగ్నివీర్‌ టెక్నికల్‌(ఆల్‌ ఆర్మ్స్‌); అగ్నివీర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌/స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌(ఆల్‌ ఆర్మ్స్‌); అగ్నివీర్‌ ట్రేడ్స్‌మ్యాన్‌(టెన్త్‌ పాస్‌)(ఆల్‌ ఆర్మ్స్‌); అగ్నివీర్‌ ట్రేడ్స్‌మ్యాన్‌(8వ తరగతి ఉత్తీర్ణత) (ఆల్‌ ఆర్మ్స్‌).
వయసు:17 1/2 నుంచి 21ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థి 01.10.2003 నుంచి 01.04.2007 మధ్య జన్మించి ఉండాలి.
అర్హత: పోస్టును అనుసరించి ఎనిమిదో తరగతి, పదో తరగతి/మెట్రిక్యులేషన్, 10+2/ఇంటర్మీడియట్‌(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ లేదా ఆర్ట్స్, కామర్స్, సైన్స్‌), సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్ష, రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ (ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌/ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌), వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన 
ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 22.03.2024.
ఆన్‌లైన్‌ పరీక్షలు ప్రారంభం: 22.04.2024.

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/

చదవండి: Indian Coast Guard Notification 2024: ఇంటర్‌ విద్యార్హతతో 260 నావిక్‌ ఉద్యోగాలు.. ఎంపిక ఇలా

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags