Asian Champions Trophy: ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్‌కి చేరిన భారత్
నవంబర్ 19వ తేదీ జరిగిన రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ 2–0 గోల్స్ తేడాతో 2018 జకార్తా ఆసియా క్రీడల విజేత జపాన్ జట్టును ఓడించింది. భారత్ తరఫున వైస్ కెప్టెన్ నవ్‌నీత్ కౌర్ (48వ నిమిషంలో), లాల్‌రెమ్‌సియామి (56వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. సలీమా టెటె నాయకత్వంలో ఈ టోర్నీలో ఆడుతున్న భారత జట్టుకిది వరుసగా ఆరో విజయం.
లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గిన టీమిండియా నాకౌట్ మ్యాచ్‌లోనూ గెలుపొందింది. నేడు జరిగే ఫైనల్లో పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత, ప్రస్తుత ఆసియా క్రీడల చాంపియన్ చైనా జట్టుతో భారత్ తలపడుతుంది. తొలి సెమీఫైనల్లో చైనా 3–1తో మలేసియాపై గెలిచింది. లీగ్ దశలో భారత జట్టు 3–0తో చైనాపై గెలిచింది. అదే ఫలితాన్ని నవంబర్ 20వ తేదీ పునరావృతం చేస్తే భారత జట్టు మూడోసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను సొంతం చేసుకుంటుంది.
WPL 2025: మహిళల ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితా విడుదల
ఇప్పటి వరకు.. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఏడుసార్లు జరగ్గా.. భారత జట్టు రెండుసార్లు చాంపియన్‌గా (2016, 2023) నిలిచి, మరో రెండుసార్లు (2013, 2018) రన్నరప్‌తో సరిపెట్టుకుంది. జపాన్ జట్టు మూడుసార్లు (2010, 2013, 2023) ఫైనల్‌కు చేరుకొని ఒకసారి (2010లో) విజేతగా నిలిచి, రెండుసార్లు తుది పోరులో ఓడిపోయింది.