AFI Athletes Commission: అథ్లెట్స్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌గా అంజూ బాబీ జార్జి

భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) నూతన కార్యవర్గం తొలి వార్షిక సర్వసభ్య సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఇందులో భాగంగా 9 మంది అథ్లెట్లతో కూడిన ఏఎఫ్‌ఐ అథ్లెట్స్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌లో ఆరుగురు మహిళా అథ్లెట్లు, ముగ్గురు పురుష అథ్లెట్లు ఉన్నారు.

ఈ కమిషన్‌ చైర్‌పర్సన్‌గా డబుల్ ఒలింపియన్, మాజీ లాంగ్ జంపర్ అంజూ బాబీ జార్జి నియమితులయ్యారు. కమిషన్‌లో అంజూతో పాటు జ్యోతిర్మయి సిక్దర్ (రన్నింగ్), కృష్ణ పూనియా (డిస్కస్‌ త్రో), ఎండీ వల్సమ్మ (హర్డిల్స్), సుధా సింగ్ (స్టీపుల్‌ఛేజ్‌), సునీతా రాణి (రన్నింగ్) కూడా సభ్యులుగా నియమితులయ్యారు.

పురుషుల విభాగం నుంచి.. ఏఎఫ్‌ఐ అధ్యక్షుడు బహదూర్‌ సింగ్‌ సాగు, ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన స్టార్ జావెలిన్‌ త్రోయర్ నీరజ్ చోప్రా, అవినాశ్ సాబ్లే (స్టీపుల్‌ఛేజ్‌) కమిషన్‌లో చోటు దక్కించుకున్నారు.

Sports Awards: తెలుగు తేజాలు దీప్తి, జ్యోతిలకు ‘అర్జున’ అవార్డు

మహిళా అథ్లెట్లు.. ముందు కమిషన్‌లో నలుగురు మహిళల ఉండగా, ఈసారి ఆ సంఖ్యను పెంచి 6కు చేరింది. బహదూర్‌ సింగ్ గతంలో సుదీర్ఘకాలం ఈ కమిషన్‌ చైర్మన్‌గా పనిచేసి, ఇప్పుడు కూడా ఇందులో భాగం అయ్యారు.

అదిలె సుమరివాలా.. 2012 నుంచి మూడు పర్యాయాల వరకు ఏఎఫ్‌ఐ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన ప్రపంచ అథ్లెటిక్స్ కౌన్సిల్‌ బోర్డు సభ్యుడిగా కూడా ఉన్నారు.

World Blitz Championship: రెండోసారి ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌గా ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌

#Tags