World Blitz: ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్ సంయుక్త విజేతలు కార్ల్‌సన్, నిపోమ్ నిషి
ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో తొలిసారి సంయుక్త విజేతలు అవతరించారు.
ఈ ఫార్మాట్‌లో ఇప్పటికే ఆరుసార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ట్‌సన్ ఈసారి రష్యా గ్రాండ్ మాస్టర్ నిపోమ్‌నిషితో కలిసి టైటిల్ పంచుకున్నాడు.
వీరిద్దరి మధ్య ఫైనల్లో ఏడు గేమ్‌లో ముగిశాక 3.5-3.5తో సమంగా నిలిచారు. ఫైనల్ అనంతరం ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీ విజేతలకు బహుమతి ప్రదానోత్సవం జరిగింది.
మహిళల ర్యాపిడ్ ఫార్మాట్లో విజేతగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి స్వర్ణ పతకంతోపాటు విన్నర్స్ ట్రోఫీని, బ్లిట్జ్ విభాగంలో వైశాలి కాంస్య పతకాన్ని అందుకున్నారు.
World Blitz Championship: ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో వైశాలికి కాంస్య పతకం
#Tags