Khelo India Youth Games: మహిళల అథ్లెటిక్స్‌లో రజితకు పసిడి పతకం
హరియాణా రాష్ట్రం, పంచ్‌కుల జిల్లాలోని పంచ్‌కుల వేదికగా జరుగుతోన్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2022లో జూన్ 7న ఆంధ్రప్రదేశ్‌కు రెండు స్వర్ణాలు, ఒక కాంస్యం లభించాయి. అండర్–18 మహిళల అథ్లెటిక్స్ 400 మీటర్ల విభాగంలో కుంజా రజిత పసిడి పతకం సొంతం చేసుకోగా... ముగద శిరీష కాంస్య పతకాన్ని దక్కించుకుంది. రజిత 56.07 సెకన్లలో రేసును ముగించి అగ్రస్థానంలో నిలువగా ... శిరీష 58 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానాన్ని సంపాదించింది.
Junior World Cup: భారత క్రీడాకారిణి రిథమ్ సాంగ్వాన్ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందింది?
మరోవైపు మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 64 కేజీల విభాగంలో సానపతి పల్లవి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. పల్లవి మొత్తం 189 కేజీలు బరువెత్తి తొలి స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఈ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ రెండు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఆరు పతకాలు సాధించి 14వ స్థానంలో ఉంది.
Hockey: ఆసియా కప్ టోర్నీలో భారత్ ఎవరి నేతృత్వంలో బరిలో దిగనుంది?
మాయావతికి కాంస్యం
అండర్–18 మహిళల అథ్లెటిక్స్ 100 మీటర్ల విభాగంలో నకిరేకంటి మాయావతి(తెలంగాణ) కాంస్య పతకం సొంతం చేసుకుంది. మాయావతి 12.23 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఈ క్రీడల్లో ఒక రజతం, మూడు కాంస్యాలు నెగ్గిన తెలంగాణ మొత్తం నాలుగు పతకాలతో 25వ స్థానంలో ఉంది.
Badminton: థామస్ కప్ టీమ్ టోర్నమెంట్ చాంపియన్ భారత్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్(Telugu Current Affairs), స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్
GK International Quiz: పారిస్ బుక్ ఫెస్టివల్ 2022లో గెస్ట్ ఆఫ్ హానర్ కంట్రీగా ఎంపికైన దేశం?