Chess: సూపర్‌బెట్ ర్యాపిడ్ టోర్నీ విజేత విశ్వనాథన్ ఆనంద్
Daily Current Affairs in Telugu - Sports: సూపర్‌బెట్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్–2022లో భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ విజేతగా అవతరించాడు. పోలాండ్ రాజధాని నగరం వార్సా వేదికగా పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత తొమ్మిది రౌండ్‌ల తర్వాత ఆనంద్ 14 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. మే 21న జరిగిన మూడు గేముల్లో ఆనంద్ ఒక విజయం, ఒక ‘డ్రా’, ఒక పరాజయం నమోదు చేశాడు. ఈ టోర్నీలో విజయానికి రెండు పాయింట్లు, ‘డ్రా’కు ఒక పాయింట్ కేటాయించారు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఆనంద్ ఆరు గేముల్లో గెలిచి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. 13 పాయింట్లతో రిచర్డ్ రాపోట్ (హంగేరి) రెండో స్థానంలో, 12 పాయింట్లతో డూడా జాన్ క్రిస్టాఫ్ (పోలాండ్) మూడో స్థానంలో నిలిచారు. మే 22 నుంచి బ్లిట్జ్ విభాగంలో టోర్నీ జరుగుతుంది.
Archery: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నీలో భారత్‌కు స్వర్ణం
GK Persons Quiz: కర్ణాటక బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్‌కు అంబాసిడర్‌గా నియమితులైన భారతీయ క్రికెటర్?
స్ట్రాస్‌బర్గ్ ఓపెన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన జంట?
ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్ వేదికగా మే 21న ముగిసిన స్ట్రాస్‌బర్గ్ ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నీ–2022లో భారత స్టార్ సానియా మీర్జా–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జంట రన్నరప్‌గా నిలిచింది. గంటా 55 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సానియా–లూసీ హర్డెస్కా ద్వయం 7–5, 5–7, 6–10తో ‘సూపర్ టైబ్రేక్’లో నికోల్ మెలిచార్ మార్టినెజ్ (అమెరికా)–దరియా సావిల్లె (ఆస్ట్రేలియా) జోడీ చేతిలో ఓడిపోయింది. ఫైనల్లో ఓటమి పాలైన సానియా–హర్డెస్కా జంటకు 5,400 యూరోల (రూ. 4 లక్షల 44 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 180 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Indian Navy: సూరత్, ఉదయగిరి యుద్ధనౌకల జలప్రవేశం ఎక్కడ జరిగింది?Hockey: ఆసియా కప్ టోర్నీలో భారత్ ఎవరి నేతృత్వంలో బరిలో దిగనుంది?
GK Sports Quiz: భారతదేశంలోని ఏ రాష్ట్రం 2023 FIH పురుషుల హాకీ ప్రపంచ కప్ లోగోను ఆవిష్కరించింది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : సూపర్‌బెట్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్–2022లో విజేతగా నిలిచిన భారతీయుడు?
ఎప్పుడు : మే 21
ఎవరు : విశ్వనాథన్ ఆనంద్
ఎక్కడ : వార్సా, పోలాండ్
ఎందుకు : ఈ టోర్నీలో నిర్ణీత తొమ్మిది రౌండ్‌ల తర్వాత ఆనంద్ 14 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచినందున..
Daily Current Affairs in Telugu: 2022, మే 21 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్(Telugu Current Affairs), స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్