Asia Cup 2023: భారత జూనియర్‌ మహిళల హాకీ జట్టు ఘనత.. తొలిసారి ఆసియా కప్‌ సొంతం

భారత జూనియర్‌ మహిళల హాకీ జట్టు ఎట్టకేలకు ఏడో ప్రయత్నంలో తొలిసారి ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది.

జూన్ 11న‌ జరిగిన ఫైనల్లో భారత్‌ 2–1 గోల్స్‌ తేడాతో నాలుగుసార్లు చాంపియన్‌ దక్షిణ కొరియాను బోల్తా కొట్టించింది. భారత్‌ తరఫున అన్ను (22వ ని.లో), నీలమ్‌ (41వ ని.లో) ఒక్కో గోల్‌ సాధించగా.. కొరియా జట్టుకు పార్క్‌ సియోయోన్‌ (25వ ని.లో) ఏకైక గోల్‌ను అందించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఫైనల్‌’ ప్రీతి కెప్టెన్సీలోని భారత జట్టు ఈ టోర్నీలో అజేయంగా నిలిచింది. లీగ్‌ దశలో మూడు మ్యాచ్‌ల్లో గెలిచి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న టీమిండియా సెమీఫైనల్లో, ఫైనల్లో పటిష్టమైన జపాన్, కొరియా జట్లను ఓడించింది. 
హాకీ ఇండియా నజరానా.. 
తొలిసారి ఆసియా కప్‌ టైటిల్‌ నెగ్గిన భారత జట్టుకు హాకీ ఇండియా (హెచ్‌ఐ) నజరానా ప్రకటించింది. జట్టులోని ప్రతి సభ్యురాలికి రూ. 2 లక్షలు చొప్పు న.. సహాయక సిబ్బందికి రూ. 1 లక్ష చొప్పున నగదు ప్రోత్సాహకం అందజేస్తామని తెలిపింది.

French Open 2023: మూడోసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ నెగ్గిన సెర్బియా స్టార్‌.. మళ్లీ ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్

#Tags