Gulveer Singh: 5 వేల మీటర్ల పరుగులో గుల్‌వీర్ జాతీయ రికార్డు

గుల్‌వీర్‌ సింగ్ తన అద్భుత ప్రతిభతో భారతీయ అథ్లెటిక్స్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు.

26 ఏళ్ల గుల్‌వీర్‌ జపాన్‌లో జరిగిన యోగిబో అథ్లెటిక్స్‌ చాలెంజ్‌ కప్‌ టోర్నీలో 5000 మీటర్ల పరుగులో జాతీయ రికార్డును బద్దలు కొట్టి స్వర్ణ పతకం సాధించాడు.

5 వేల‌ మీటర్ల దూరాన్ని 13 నిమిషాల 11.82 సెకన్లలో పూర్తి చేశాడు. తద్వారా 13 నిమిషాల 18.92 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును గుల్‌వీర్‌ బద్దలు కొట్టాడు. 

ఈ ఏడాది ఆరంభంలో పోర్ట్‌లాండ్‌ ట్రాక్‌ ఫెస్టివల్‌లో గుల్‌వీర్‌ ఈ సమయాన్ని నమోదు చేశాడు. అలాగే కాలిఫోర్నియాలో జరిగిన టెన్‌ ట్రాక్‌ మీట్‌లో 27 నిమిషాల 41.81 సెకన్లలో లక్ష్యాన్ని చేరి 10 వేల మీటర్ల జాతీయ రికార్డును కూడా బద్దలుకొట్టాడు. 2008లో సురేందర్‌ సింగ్‌ (28 నిమిషాల 02.89 సెకన్ల) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. 

Oscar Piastri: అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రి టైటిల్‌ విజేత ఆస్కార్‌ పియాస్ట్రి

#Tags