Deepthi Jeevanji: పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన దీప్తి జివాంజి
ప్రపంచ పారా చాంపియన్, పారా ఆసియా గేమ్స్ చాంపియన్ హోదాలో తొలిసారి పారాలింపిక్స్‌లో అడుగుపెట్టిన దీప్తి మూడో స్థానాన్ని సంపాదించింది.
ఎనిమిది మంది పోటీపడ్డ ఫైనల్లో 20 ఏళ్ల దీప్తి 55.82 సెకన్లలో గమ్యానికి చేరుకుంది. దీప్తి కాంస్యంతో పారిస్ పారాలింపిక్స్‌లో సెప్టెంబర్ 3వ తేదీ వరకు భారత్ సాధించిన పతకాల సంఖ్య 16కు చేరుకుంది.
ఇందులో.. యూలియా షులియర్ (ఉక్రెయిన్; 55.16 సెకన్లు) స్వర్ణం సంపాదించగా.. టర్కీ అథ్లెట్ ఐసెల్ ఒండెర్ (55.23 సెకన్ల) రజత పతకాన్ని గెల్చుకుంది.
ఈ ఏడాది మేలో జపాన్‌లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 55.07 సెకన్లతో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకం నెగ్గిన దీప్తి అదే ప్రదర్శనను ‘పారిస్’లో పునరావృతం చేయలేకపోయింది.
Paris Paralympics 2024: పారాలింపిక్స్‌లో భారత్‌కు ఒకే రోజు ఏడు పతకాలు
నిత్యశ్రీ శివన్ కాంస్యం..
మహిళల బ్యాడ్మింటన్ ఎస్‌హెచ్6 సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణి నిత్యశ్రీ శివన్ కాంస్య పతకాన్ని సాధించింది. కాంస్య పతక మ్యాచ్‌లో నిత్యశ్రీ 21–14, 21–6తో రీనా మార్లిన్ (ఇండోనేసియా)పై గెలిచింది.
➢ మహిళల షాట్‌పుట్ ఎఫ్34 కేటగిరీలో భారత అథ్లెట్ భాగ్యశ్రీ జాధవ్ ఇనుప గుండును 7.28 మీటర్ల దూరం విసిరి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.
➢ భారత మహిళా షూటర్ 22 ఏళ్ల అవని లేఖరా 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఎస్‌హెచ్1 ఈవెంట్ ఫైనల్లో ఐదో స్థానంలో నిలిచింది.