Cristiano Ronaldo: చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డో.. ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా..
ఇటీవలే తన కెరీర్‌లో 900 గోల్‌లను సాధించి చరిత్ర సృష్టించిన రొనాల్డో.. తాజాగా మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
సోషల్ మీడియా కింగ్..
రొనాల్డో తన సోషల్ మీడియా ఖాతాలన్నింటిలో కలిపి ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 100 కోట్లను దాటింది. తద్వారా సోషల్‌మీడియాలో ఈ అరుదైన ఘనత సాధించిన తొలి వ్యక్తిగా రొనాల్డో సరికొత్త చరిత్ర సృష్టించాడు.
కాగా రొనాల్డో ఇటీవలే యువర్ క్రిస్టియానో" పేరుతో యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించగా.. 90 నిమిషాల వ్యవధిలోనే ఇది ఒక మిలియన్ సబ్‌స్క్రైబర్స్‌ను పొందాడు.
ప్రస్తుతం అతడి యూట్యూబ్ ఖాతాకు 6 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఇన్‌స్టాలో ఈ ఫుట్‌బాల్ స్టార్‌ను 63.9కోట్ల మందికి పైగా అనుసరిస్తున్నారు. ‘ఎక్స్’లో 11.3 కోట్ల మంది, ఫేస్‌బుక్‌లో 17 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
Cash Rewards: పారాలింపిక్స్‌లో విజేతలకు నజరానా ఇచ్చిన క్రీడా శాఖ మంత్రి.. ఎంతంటే..