Chandrayaan-3: ఆ న‌లుగురు... చంద్రయాన్-3 స‌క్సెస్ వెన‌క ఉన్న‌ది వీరే

చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైంది. భారత అంతరిక్ష యానంలో ఎన్నో ఏళ్ల కళ సాకారమైంది. ఈ మహత్తర కార్యం వెనక 1000 మంది ఇంజినీర్ల కృషి ఉందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు.
ఆ న‌లుగురు... చంద్రయాన్-3 స‌క్సెస్ వెన‌క ఉన్న‌ది వీరే

వీళ్లనే మూన్ స్టార్లుగా పిలుస్తున్నారు. ఇందులో ప్రధానమైనవారు..

బాహుబలి రాకెట్ రూప‌క‌ల్ప‌న‌లో...
ఎస్. సోమనాథ్ ఎయిరో స్పేస్ ఇంజినీర్. చంద్రయాన్ 3ని జాబిల్లి కక్షలో ప్రవేశపెట్టడానికి ఉపయోగపడిన బాహుబలి రాకెట్‌ని రూపొందించడంలో సహకరించారు. రాకెట్‌లోకి చేర్చే ముందు చంద్రయాన్‌ 3ని పూర్తిగా పరీక్షించే బాధ్యతలను ఆయన చూసుకున్నారు.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు పూర్వ విద్యార్థి. సంస్కృత భాషను అనర్గళంగా మాట్లాడగలరు. ఈయన పేరులోని సోమనాథ్‌(చంద్రునికి ప్రభువు)  అర్థం ఉంది. ఇస్రోలో ఎంతో సమర్థవంతమైన నాయకునిగా పనిచేస్తున్నారు.
- ఎస్. సోమనాథ్ (ఇస్రో చైర్మన్‌)

ఇవీ చ‌ద‌వండి: జయహో భారత్‌... చంద్ర‌య‌న్‌-3 ప్ర‌యోగం సూప‌ర్ స‌క్సెస్‌
 
వ్యోమగామిని పంపే కార్యక్రమానికి నాయకత్వం
రాకెట్ పరిశోధనల్లో మరో కీలక శాస్త్రవేత్త . అంతరిక్షంలోకి వ్యోమగామిని పంపే కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్న ఏరోస్పేస్ ఇంజనీర్. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పూర్వ విద్యార్థి.

హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌కు మొదటి డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. గగన్‌యాన్ ప్రోగ్రామ్ కోసం అనేక క్లిష్టమైన మిషన్‌లకు నాయకత్వం వహించారు. లాంచ్ వెహికల్ మార్క్ 3 ఈయన నాయకత్వంలోనే విజయవంతమైంది.
- ఉన్నికృష్ణన్ నాయర్ (విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్)

నాలుగేళ్లుగా ఓ త‌పస్సులా...
ప్రముఖ శాస్త్రవేత్త వీరముత్తువేల్.. చంద్రయాన్-3 మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టుకు తన మేధస్సును అందిస్తున్నారు.

ఇవీ చ‌ద‌వండి: chandrayaan-3 ప్రయోజనాలు ఇవే

ఈయన చెన్నై నుంచి మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీలో పట్టా పొందారు. చంద్రయాన్-2, మంగళయాన్ మిషన్లలో కూడా ఆయన పాల్గొన్నారు.
- వీరముత్తువేల్ (చంద్రయాన్‌-3 డైరెక్టర్‌)

మరో ప్రముఖ ఇంజినీర్‌ కే. కల్పన. కరోనా మహమ్మారి విజృంభించిన కాలంలోనూ చంద్రయాన్-3 ప్రాజెక్టు కోసం దీక్షగా తన బృందంతో కలిసి పనిచేశారు. మన దేశానికి ఉపగ్రహాల తయారీలో తన జీవితాన్ని అంకితం చేశారు. ఆమె చంద్రయాన్-2, మంగళయాన్ మిషన్లలో కూడా పాల్గొన్నారు.
-కె. కల్పన(చంద్రయాన్ 3 డిప్యూటీ డైరెక్టర్)

ఇవీ చ‌ద‌వండి: చంద్రయాన్-3 సూప‌ర్ స‌క్సెస్‌.. ఇక వాట్ నెక్ట్స్.. దీని వ‌ల్ల మానవాళికి ఏం లాభం అంటే..?

ప్రముఖ ఇంజినీర్ ఎం. వనిత చంద్రయాన్-2 మిషన్‌కు ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందిన ఆమె.. జాబిల్లిపై చేసిన ప్రయోగానికి నాయకత్వం వహించిన భారత మొదటి మహిళ. చంద్రయాన్-2పై ఆమెకున్న జ్ఞానాన్ని చంద్రయాన్‌ 3 కోసం శాస్త్రవేత్తల బృందం సరిగా వినియోగించుకుంది. ఆమెకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం.
- ఎం. వనిత(యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్)బెంగళూరు

ఎమ్‌ శంకరన్‌ ISRO పవర్‌హౌస్‌గా ఖ్యాతిగాంచారు. ఎందుకంటే కొత్త పవర్ సిస్టమ్‌లు, పవర్ శాటిలైట్‌లకు సౌర శ్రేణులను తయారు చేయడంలో ఈయనకి మంచి నైపుణ్యం ఉంది. ఉపగ్రహాల తయారీలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న ఆయన.. చంద్రయాన్-1, మంగళయాన్, చంద్రయాన్-2ల్లో కూడా పనిచేశారు. చంద్రయాన్-3లో ఉపగ్రహం తగినంత వేడి, చల్లగా ఉండేలా చూసుకోవడం ఈయన పని. ల్యాండర్ బలాన్ని రూపొందించడంలో ఆయన సహాయం చేశారు. ఈయన భౌతికశాస్త్రంలో మాస్టర్ పట్టా పొందారు.
- ఎమ్‌ శంకరన్ (యూఆర్ రావు సాటిలైట్ సెంటర్ డైరెక్టర్) బెంగళూరు

ఇవీ చ‌ద‌వండి: డిప్లొమా, బీటెక్ అర్హ‌త‌తో హైదరాబాద్ ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు... జీతం ఎంతంటే...

లిక్విడ్ ప్రొపల్షన్ ఇంజిన్‌లను తయారు చేయడంలో నిపుణుడు. విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కావడానికి అవసరమైన థ్రస్టర్‌లను ఈయన నాయకత్వంలో అభివృద్ధి చేశారు. ఖరగ్‌పూర్‌ IIT పూర్వ విద్యార్థి. క్రయోజెనిక్ ఇంజిన్‌లను తయారు చేయడంలో కూడా ఆయన నిపుణుడు. చంద్రయాన్-3ని ప్రయోగించిన లాంచ్ వెహికల్ మార్క్ 3తో సహా ఇస్రో తయారు చేసిన చాలా రాకెట్లలో ఈయన మేధస్సు ఉపయోగపడింది.
- వీ నారాయణన్‌.. (లిక్విడ్ ప్రొపల్షన్ సెంటర్‌ డైరెక్టర్, తిరువనంతపురం)

#Tags