Indian Air Force: మరో ఘనత సాధించిన ఐఏఎఫ్‌.. ‘నైట్‌ విజన్‌ గాగుల్స్‌’తో విమానం ల్యాండింగ్

భారత వాయుసేన(ఐఏఎఫ్‌) మరో అరుదైన ఘనత సాధించింది.

నైట్‌ విజన్‌ గాగుల్స్‌(ఎన్‌వీజీ) సాయంతో తక్కువ వెలుతురు ఉన్న సమయంలో సీ–130జే రవాణా విమానాన్ని విజయవంతంగా ల్యాండ్‌ చేసింది. తూర్పు సెక్టార్‌లోని అడ్వాన్స్‌డ్‌ ల్యాండింగ్‌ గ్రౌండ్‌లో ఈ ప్రక్రియను చేపట్టింది. ఇందుకు సంబంధించిన రెండు వీడియోలను ‘ఎక్స్‌’లో షేర్‌ చేసింది. ఒక వీడియోలో ఎన్‌వీజీ టెక్నాలజీతో విమానం సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అయిన దృశ్యాలు, మరో వీడియోలో విమానంలో లోపలి నుంచి దృశ్యాలు కనిపిస్తున్నాయి. 

 

 

ఎన్‌వీజీ విజువల్స్‌ కావడంతో ఈ దృశ్యాలు ఆకుపచ్చ రంగులో విభిన్నంగా ఉన్నాయి. మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకొనే ప్రక్రియలో భాగంగా తమ శక్తి సామర్థ్యాలను పెంపొందించుకొనేందుకు కట్టుబడి ఉన్నామని భారత వాయుసేన పేర్కొంది. నైట్‌ విజన్‌ గాగుల్స్‌ టెక్నాలజీతో భారత వాయుసేన మరింత బలోపేతమైంది. వెలుతురు తక్కువ ఉన్న సమయాల్లో, రాత్రిపూట విమానాలను సురక్షితంగా ల్యాండ్‌ చేయడానికి, సెర్చ్‌ ఆపరేషన్లు నిర్వహించడానికి ఈ సాంకేతిక పరిజ్ఞానం దోహదపడనుంది. 

Strong Solar Storm: భూమిని తాకిన చాలా బలమైన సౌర తుఫాను!!

#Tags