Digital India project: డిజిటల్‌ ఇండియా ప్రాజెక్టు పొడిగింపునకు ఆమోదం

డిజిటల్‌ ఇండియా ప్రాజెక్టును పొడిగించే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది.
Digital India project

ఇందు కోసం 2021–22 నుంచి 2025–26 మధ్య కాలానికి రూ. 14,903 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. దీని కింద 6.25 లక్షల మంది ఐటీ నిపుణులకు కొత్త నైపుణ్యాల్లోను, 2.64 లక్షల మందికి ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీలోనూ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

Google Grammar Check Feature: గూగుల్లో గ్రామర్ చెక్ ఫీచర్

పొడిగించిన డిజిటల్‌ ఇండియా ప్రాజెక్టులో భాగంగా మరో తొమ్మిది సూపర్‌ కంప్యూటర్లను నేషనల్‌ సూపర్‌కంప్యూటింగ్‌ మిషన్‌కు (ఎన్‌సీఎం) జోడించనున్నట్లు మంత్రి చెప్పారు. ఇప్పటికే ఎన్‌సీఎం కింద 18 సూపర్‌ కంప్యూటర్స్‌ ఉన్నట్లు వివరించారు. డిజిటల్‌ ఇండియా పథకం 2015లో ప్రారంభమైనప్పుడు రూ. 4,500 కోట్లతో 2022 నాటికి ఎన్‌సీఎం కింద 70 సూపర్‌కంప్యూటర్స్‌ను నెలకొల్పే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. వాటికి అదనంగా మరో తొమ్మిది సూపర్‌కంప్యూటర్లకు తాజాగా ఆమోదముద్ర వేసిందని మంత్రి చెప్పారు.  

India Ai MOU with Meta: కొత్త టెక్నాలజీ దిశగా ఏఐ.. మెటాతో జట్టు

#Tags