CM YS Jagan Speech At Machilipatnam: బందరు పోర్టు కల నెరవేర్చాం... ఇక‌పై జిల్లా చరిత్ర మార‌బోతోంది

బందరు పోర్టు చిరకాల స్వప్నమని, అన్ని సమస్యలను అధిగమించి పోర్టుకు లైన్‌క్లియర్‌ చేశామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మచిలీపట్నం గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణ పనుల ప్రారంభోత్సవం సందర్భంగా.. సోమవారం జిల్లా పరిషత్‌ సెంటర్‌లోని భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు.
CM YS Jagan

బందరుకు సముద్ర వర్తకంలో వందల ఏళ్ల చరిత్ర ఉంది. కానీ, పోర్టు నిర్మాణం గురించి ఎవరూ పట్టించుకోలేదు. మేం వచ్చాక బందరు వాసుల కలను నెరవేర్చాం. కృష్ణా జిల్లా చరిత్రను మార్చబోయే అస్త్రంగా పోర్టు మారబోతుందని ఆయన ఆకాంక్షించారు.  

35.12 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంలో పోర్టు నిర్మాణం జరుగుతోందని తెలిపారాయన. పోర్టుకు కనెక్టివిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కూడా చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. అలాగే గుడివాడ-మచిలీపట్నం రైల్వే లైన్‌పోర్టుకు అనుసంధానం చేయనున్నట్లు సీఎం జగన్‌ వెల్లడించారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఒడిషా, చత్తీస్‌గఢ్‌లకూ ఇది చేరువలో ఉంటుందని తెలిపారాయన. పోర్టు ఆధారిత పరిశ్రమల వల్ల లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

☛➤☛ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వ‌రుస‌గా గుడ్‌న్యూస్‌లు...

  • రూ.5,156 కోట్లతో నిర్మాణ పనులకు సీఎం జగన్‌ భూమిపూజ
  • భూసేకరణ, అన్ని అనుమతులు, ఫైనాన్షియల్‌ క్లోజర్‌ అయిన తర్వాతే పనులు ప్రారంభం
  • పోర్టు రాకతో వాణిజ్య కార్యకలాపాల విస్తరణ
  • ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల మందికి ఉపాధి
  • 24–30 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యం.. దీనితో మారనున్న కృష్ణాజిల్లా ముఖచిత్రం

సీఎం జగన్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

  • బందరుతో సముద్ర వర్తకానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది
  • ముంబై, చెన్నై మాదిరిగా బందరు మహానగరంగా ఎదిగే అవకాశం ఉంది
  • నెరవేరని ఈ కల ఇప్పుడు నెరవేరుతోంది
  • ఆ పరిస్థితులన్నీ పూర్తిగా మారుస్తున్నాం
  • అన్ని కోర్టు కేసులను అధిగమించి, భూసేకరణ పూర్తిచేశాం
  • అన్ని అనుమతులు తీసుకొచ్చాం
  • ఫైనాన్షియల్‌ క్లోజర్‌ పూర్తిచేశాం
  • పోర్టు నిర్మాణ పనులకు టెండర్లు పూర్తిచేసిన, ఆపనులు ప్రారంభించాం
  • 5156 కోట్లతో నాలుగు బెర్తులు రాబోతున్నాయి
  • 35 మిలియన్‌ టన్నుల కెపాసిటీతో స్టార్ట్‌ అవుతుంది
  • ట్రాఫిక్‌ పెరిగే కొద్దీ… 116 మిలియన్‌ టన్నుల కెపాసిటీ వరకూ విస్తరించుకునే అవకాశం ఉంది
  • పోర్టుకు కనెక్టివిటీ ఇన్‌ఫ్రాను కూడా నిర్మిస్తున్నాం
  • 6.5 కిలోమీటర్ల దూరంలోని జాతీయ రహదారిని నిర్మిస్తున్నాం
  • 7.5 కిలోమీటర్ల గుడివాడ- మచిలీపట్నం రైలు మార్గాన్ని కనెక్టివిటీ చేస్తున్నాం

☛➤☛ పేదలకు ఇళ్లివ్వడంలో ఏపీ నంబర్‌–1

  • బందరు కాల్వనీటిని పైపులైను ద్వారా తీసుకు వచ్చి.. అనుసంధానం చేస్తున్నాం
  • అత్యంత మెరుగైన రవాణా వ్యవస్థకు పోర్టు మంచి ఆధారంగా ఉంటుంది
  • కృష్ణా జిల్లా చరిత్రను ఈ పోర్టు మారుస్తుంది
  • ఈ పోర్టు వల్ల మన రాష్ట్రం మాత్రమే బాగుపడ్డం కాకుండా.. వ్యాపారాలు బాగుపడతాయి
  • మచిలీపట్నం పోర్టు వల్ల పక్క రాష్ట్రాలకు ఉపయోగం
  • ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకూ ఉపయోగం
  • పోర్టు ఆధారిత పరిశ్రమల వల్ల ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయి
  • డిగ్రీలు పూర్తిచేసుకున్న మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు లభిస్తాయి
  • పోర్టు నిర్మాణంలో గతంలో అనేక అడ్డంకులు వచ్చాయి
  • పోర్టు ఇక్కడ రాకూడదని తపన, తాపత్రయ పడ్డాడు చంద్రబాబు
  • 22 గ్రామాలు తీసుకోవాలని, 33వేల ఎకరాలు తీసుకోవాలని నోటిఫై చేసి.. రైతులు భూములను అమ్ముకునే స్వేచ్ఛలేకుండా చంద్రబాబు చేశాడు.
  • దీనివల్ల పోర్టు అడగరని చంద్రబాబు ఇలా చేశాడు
  • ఇక్కడ ప్రజలు బాగుపడకపోతే.. అందరూ అమరావతిలో తాను బినామీగా పెట్టుకున్న భూములను విపరీతంగా అమ్ముకోవచ్చని తీరని ద్రోహం చేశాడు
  • పోర్టుకు సంబంధించిన రోడ్డు, రైలు మార్గాలకు కేవలం 250 ఎకరాలు మాత్రమే తీసుకున్నాం
  • ప్రతి రైతు ముఖంలో చిరునవ్వులు చూడాలంటూ నానికి చెప్పాను

☛➤☛ దేశానికి గొప్ప బహుమతి సీఎం జగన్‌... 20 వేల కోట్ల పెట్టుబ‌డితో...25 వేల మందికి ఉపాధి : రాజేష్‌ అదానీ

  • రైతులందరి సంతోషం మధ్య ఆ భూములు తీసుకుని మంచి పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించాం
  • ప్రభుత్వ భూముల్లో 4వేల ఎకరాల్లో ఆధారిత పరిశ్రమలు వచ్చేట్టుగా కార్యాచరణ చేస్తున్నాం
  • 24 నెలల్లోనే ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయి
  • పెద్ద పెద్ద ఓడలు కనిపిస్తాయి.. మచిలీపట్నంలో
  • మన ప్రభుత్వం వచ్చాక మచిలీపట్నం రూపురేఖలు మారుతున్నాయి
  • గతంలో బందరు ముఖ్యపట్టణమైనా.. కలెక్టరుతోపాటు ఏ ఒక్క అధికారీ ఇక్కడ ఉండలేదు:ప్రజలకు మంచిచేస్తూ ఇక్కడే ఈ జిల్లాలోనే కలెక్టర్‌ మాత్రమే కాదు, మొత్తం యంత్రాంగం జిల్లాలో ఉండేట్టుగా మచిలీపట్నాన్ని జిల్లాకేంద్రంగా చేశాం
  • జిల్లాల విభజన వల్ల ఇది సాధ్యమైంది
  • మరో మూడు నెలల్లో బందరు మెడికల్‌ కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభం అవుతున్నాయి
  • అవనిగడ్డ, పెడన, పామర్రు, కైకలూరు ప్రాంతాల ప్రజలకు మంచి వైద్య సేవలు అందుతాయి
  • ఏ సమయంలో నైనా మత్స్యసంపదను ఒడ్డుకు తెచ్చుకునేందుకు ఇక్కడే మరో రూ.420 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌ పనులు కూడా జరుగుతున్నాయి
  • 60శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి
  • నాలుగు నెలల్లో ఇదికూడా అందుబాటులోకి వస్తోంది
  • ఇమిటేషన్‌ జ్యుయలరీ తయారీకి మద్దతుగా… పాదయాత్రలో ఇచ్చిన హామీకి తగ్గట్టుగా రూ.7.60 యూనిట్‌ ధరను.. రూ.3.75లకు తగ్గించాం
  • దాదాపు 45వేలమందికి బతుకుతున్న ఈపరిశ్రమకు మంచిచేశాం
  • ఈ జిల్లా ముఖ్యపట్టణంగా ఎదగడమే కాకుండా.. భారీ స్థాయిలో వర్తకానికి, వాణిజ్యానికి పారిశ్రామిక అభివృద్ధికి మచిలీపట్నం కేరాఫ్ అడ్రస్‌గామారబోతోంది
  • రాష్ట్రంలో పోర్టులకు సంబంధించి మన ప్రభుత్వం అనేక మార్పులు తీసుకువచ్చింది
  • 320 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని 2025-2026 నాటికి అదనంగామరో 110 మిలియన్‌ టన్నుల సామర్థ్యాన్ని జోడిస్తున్నాం

☛➤☛ జ‌గ‌న‌న్న విదేశీ విద్యాదీవ‌న ప‌థ‌కం పూర్తి వివ‌రాలు ఇవే... ఇలా అప్లై చేసుకోండి

  • 75 సంవత్సరాలు స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ ఉన్న పోర్టులు నాలుగు పోర్టులు అయితే.. అక్షరాల రూ.16వేల కోట్లతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేటలో జోరుగా అడుగులు పడుతున్నాయి
  • కాకినాడ గేట్‌వే ప్రాజెక్టుకు అడుగులు ముందుకు పడ్డాయి
  • ఒక్కో పోర్టులో ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల ఉద్యోగాలు వస్తాయి
  • పోర్టు ఆధారిత పరిశ్రమల కారణంగా లక్షల్లో ఉద్యోగాలు చదువుకున్న మన పిల్లలకు వస్తాయి
  • మన పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చే.. గొప్ప కార్యక్రమం జరగబోతోంది
  • గతంలో చరిత్రలోఎప్పుడూ చూడని విధంగా.. మన ప్రభుత్వంలో అడుగులు ముందుకేశాం
  • ప్రపంచస్థాయి ప్రమాణాలతో  ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణాలు జరుగుతున్నాయి
  •  ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లను కూడా నిర్మిస్తున్నాం
  • మరోవంక పేదల సంక్షేమానికి కట్టుబడి అన్ని కార్యక్రమాలూ చేస్తున్నాం
  • పేదరికాన్ని సమూలంగా తీసివేయాలని అక్షరాల రూ.2.10లక్షల కోట్లు డీబీటీ ద్వారా అందించాం
  • నాన్‌ డీబీటీ ద్వారా మరో రూ.3 లక్షల కోట్లు ప్రజల చేతుల్లో పెట్టాం
  • లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఈ కార్యక్రమాలు అమలుచేస్తున్నాం
  • నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం
  • ప్రజలకు అందించే సేవల్లో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం
  • సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా పల్లె పల్లెల్లో ప్రజల ముంగిటకే సేవలు తీసుకు వచ్చాం
  • ప్రజల ప్రభుత్వంగా మార్పులు తీసుకు వచ్చాం
  • ఇప్పటికే 30 లక్షల ఇళ్లపట్టాలను అక్క చెల్లెమ్మల పేరుతో వారికి అందించాం
  • ఇలా రూ.1.5 లక్షల కోట్లు అక్క చెల్లెమ్మల చేతిలో పెట్టాం
  • అమరావతి ప్రాంతంలో కూడా ఇలా 50వేల మందికి నిరుపేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమం రెండున్నర సంవత్సరాల క్రితం ప్రారంభించాం
  • కాని ఆ యజ్ఞానానికి రాక్షసులు అడ్డు పడ్డారు
  • టీడీపీకి తోడు గజదొంగల ముఠా అడ్డుపడుతోంది

☛➤☛  వ‌స‌తిదీవెన కింద 912 కోట్ల విడుద‌ల‌... ఇప్ప‌టివ‌ర‌కు 14,200 కోట్లు అంద‌జేసిన సీఎం వైఎస్ జ‌గ‌న్‌

  • దోచుకోవడం… పంచుకోవడం.. వీరి పని
  • టీడీపీ, గజదొంగల ముఠాకు తోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-౫ వీరికి తోడు ఒక దత్తపుత్రుడు కలిశాడు
  • అమరావతిలో ప్రభుత్వ డబ్బుతో గేటెట్‌ కమ్యూనిటీ కట్టుకోవాలనుకున్నారు
  • బినామీల పేరుతో భూములుగడించి లక్షల కోట్లు దోచుకోవాలని ప్రయత్నించారు
  • ఇందులో పేదల వర్గాలు కేవలం పాచి పనులు మాత్రమే చేయాలి
  • రోజువారీ పనులు చేసే కార్మికులుగానే ఉండాలంట
  • అమరావతిలో వీళ్ల పొద్దుటే ఎంటర్‌ కావాలంట, పనులు చేసి తిరిగి వెనక్కి పోవాలంట
  • ఇంతకన్నా.. సామాజిక అన్యాయం ఎక్కడైనా జరుగుతుందా?
  • ఇలాంటి మనస్తత్వం ఉన్న రాక్షసులతో యుద్ధంచేస్తున్నాం
  • వారి వికృతఆలోచనలకు మద్దు ఇవ్వగలమా?
  • పేదల జీవితాలు మారే విధంగా అండగా నిలబడాలి
  • ఈ నెల 26l అమరావతిలో ఇళ్ల పట్టాలు పంపిణీ స్వయంగాచేస్తున్నాను
  • పేదలంటే చంద్రబాబుకు చులకన 
  • ఎస్సీలు కులాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని బాబు అన్నాడు
  • బీసీల తోకలు కత్తిరించాలని అన్నాడు
  • కోడలు మగ పిల్లాడిని కంటే అత్త వద్దంటుందా అని అన్నాడు ఈ బాబు
  • మూడు రాజధానులు వద్దు అంటూ అన్ని ప్రాంతాల అభివృద్ధినే అడ్డుకున్నాడు ఈ చంద్రబాబు
  • మూడు ప్రాంతాలమీదే దాడిచేశాడు చంద్రబాబు
  • తాను కనీసం ఒక్క సెంటైనా కూడా పేదవాడికి ఇచ్చిన పోలేదు చంద్రబాబు
  • ఒక్క ఇళ్లస్థలం కూడా చంద్రబాబు ఇవ్వలేదు
  • పేదలకు ఈ ప్రభుత్వం ఇళ్లస్థలాలు ఇస్తుంటే.. రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు కేసులు వేయించాడు
  • అమరావతిలో పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తే.. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని… సాక్షాత్తూ కోర్టులో కేసులు వేయించాడు

☛➤☛ ఒక అన్న‌లా జ‌గ‌న‌న్న న‌న్ను చ‌దివిస్తున్నాడు.. ఆయ‌న వ‌ల్లే నేను బీటెక్ చ‌దువుతున్నా

  • రూపం మార్చుకున్న అంటరాని తనానికి, నయా పెత్తందార్ల భావజాలానికి ప్రతీక ఈ చంద్రబాబు
  • ఈ చంద్రబాబుతోపాటు.. ఈ దుష్టచతుష్టయం.. ఈ గజదొంగల ముఠా
  • అమరావతి పరిధిలో ప్రతి పేదవాడికి 1.1 సెంటు భూమి ఇచ్చి, ఇల్లుకూడా ఉచితంగా కట్టించి ఇస్తే.. యాభైవేల మందికి కలలు సొంతం చేస్తుంటే.. దాన్ని ఈ గొప్ప పవిత్ర స్థలాన్ని చంద్రబాబు స్మశానంతో పోలుస్తాడు
  • పేదలకు తాను అధికారంలో ఉన్నప్పుడు ఒక్క సెంటు స్థలం ఇవ్వలేదు
  • కాని మనం ఇస్తే.. వాటిని స్మశానంతో పోలుస్తాడు
  • ఇలాంటి చంద్రబాబుకు అవగాహనైనా ఉందా?
  • కొన్ని లక్షల కుటుంబాలకు స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు అయినా ఇళ్లు లేదు
  • కాని చంద్రబాబుకు మానవత్వం లేదు
  • ఇలాంటి కార్యక్రమాన్ని దారుణంగా అడ్డుకుంటున్న ద్రోహి చంద్రబాబు
  • మంచి చేసిన చరిత్ర చంద్రబాబుకు ఎప్పుడూ లేదు
  • పలానా మంచి చేశామని చెప్పుకోలేని పరిస్థితి వారిది
  • వారి ఆలోచనలన్నీ.. వారి కుళ్లు, కుతంత్రాలు అన్నీ ఒక్కటే
  • ఒక్క దత్తపుత్రుడ్ని, ఎల్లోమీడియాను మాత్రం నమ్ముకుంటారంట
  • మంచిచేసిన చరిత్ర ఉన్న మీ బిడ్డ. .ఎన్నికల్లో గెలవడమే కష్టమట
  • మీ బిడ్డ పాలనలో మీకు జరిగి ఉంటే.. మీరే సైనికులుగా తోడుగా నిలవండి

#Tags