Telangana: రాష్ట్రంలోని ఏ జిల్లాలో రేడియంట్ యూనిట్ ఏర్పాటైంది?
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపల్ పరిధిలోని రావిర్యాల ఫ్యాబ్‌సిటీ (ఈ–సిటీ)లో రేడియంట్ అప్లియెన్సెస్ సంస్థ రూ.100 కోట్లు పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ మే 2న ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో కలిసి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు ఈ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రేడియంట్ అప్లియెన్సెస్ దేశంలో పెద్దఎత్తున ఎల్‌ఈడీ టీవీలను ఉత్పత్తి చేస్తోందన్నారు.
GK Science & Technology Quiz: "నూర్-2" అనే సైనిక ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం?
రూ.200 కోట్లతో పీ అండ్ జీ డిటర్జెంట్ యూనిట్
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామంలో ఉన్న ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ (పీ అండ్ జీ) పరిశ్రమలో సుమారు రూ.200 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన లిక్విడ్ డిటర్జెంట్ యూనిట్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. విద్యారంగం అభివృద్ధికి పీ అండ్ జీ అనుబంధ సంస్థ ‘పీ అండ్ జీ శిక్ష’చేస్తున్న కృషి ఎనలేనిదని మంత్రి పేర్కొన్నారు.
పార్లే ఇండియాతో ఒప్పందం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం?
ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి సముద్ర తీరప్రాంతాన్ని రక్షించేలా అమెరికాకు చెందిన పార్లే ఇండియాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతంలో ఏటా ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వాటిని రీసైక్లింగ్ చేయనున్నట్లు పార్లే ఫర్ ది ఓషన్స్ ఫౌండర్ సైరిల్ గట్చ్ తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 500 పార్లే ఎయిర్ స్టేషన్లు, 10 ఎకో ఇన్నోవేషన్ హబ్స్ ఏర్పాటుతోపాటు 20 వేల మంది సముద్రపు వారియర్స్‌ను నియమిస్తామని వివరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రేడియంట్ అప్లియెన్సెస్ సంస్థ ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ప్రారంభం
ఎప్పుడు : మే 02
ఎవరు : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇన్నొవేషన్ హబ్ హెడ్ లూయీస్ అగెర్స్‌నాప్
ఎక్కడ : రావిర్యాల ఫ్యాబ్‌సిటీ (ఈ–సిటీ), తుక్కుగూడ మున్సిపల్ పరిధి, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ
ఎందుకు : ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ కోసం..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్