Telangana: రాష్ట్రంలోని ఏ నగరంలో గూగుల్ క్యాంపస్ ఏర్పాటవుతోంది?
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ సొంత క్యాంపస్ హైదరాబాద్‌లో ఏర్పాటవుతోంది. 33 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రానున్న ఈ కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ఏప్రిల్ 28న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భవన డిజైన్‌ను ఆయన ఆవిష్కరించారు. గూగుల్‌కు ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద క్యాంపస్ కానుంది. గచ్చిబౌలిలో 7.3 ఎకరాల స్థలంలో ఈ క్యాంపస్ ఏర్పాటవుతోంది.
GK Important Dates Quiz: ప్రపంచ కిడ్నీ దినోత్సవం 2022 ఏ రోజున జరుపుకుంటారు?
యూఎస్‌లోని కాలిఫోర్నియాలో ఉన్న కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని 2015లో కేటీఆర్ సందర్శించారు. సొంత క్యాంపస్ ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ మధ్య ఆ సందర్భంగా ఒప్పందం కుదిరింది. ఇప్పటికే హైదరాబాద్‌లో గూగుల్ 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాన్ని నిర్వహిస్తోంది.
ప్రభుత్వంతో ఒప్పందం..
- వెనుకబడిన యువతకు గూగుల్ కెరీర్ సర్టిఫికెట్ స్కాలర్‌షిప్‌లను ఆఫర్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదిరింది. ఉపకార వేతనాలు అందించేందుకు, నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్, నాలెడ్జ్‌తో కలిసి గూగుల్ పనిచేయనుంది.
- వి–హబ్‌తో కలిసి విమెన్‌విల్ కార్యక్రమాన్ని సైతం గూగుల్ చేపట్టనుంది. మహిళా వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు మార్గదర్శకత్వం, మద్దతు అందిస్తారు. విద్యార్థులకు డిజిటల్ విద్య చేరువయ్యేందుకు ప్రభుత్వ పాఠశాలలతో కలిసి గూగుల్ పని చేయనుంది.
All India Radio FM Station: ఆలిండియా రేడియో నూతన కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : టెక్నాలజీ దిగ్గజం గూగుల్ సొంత క్యాంపస్‌కు శంకుస్థాపన
ఎప్పుడు : ఏప్రిల్ 28
ఎవరు : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు
ఎక్కడ : గచ్చిబౌలి, హైదరాబాద్
ఎందుకు : తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్