Jagananna Vidya Deevena: జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేసిన‌ సీఎం జగన్..

ఆంధ్రప్రదేశ్‌లో జగనన్న విద్యాదీవెన డబ్బుల విడుదల కార్యక్రమం డిసెంబర్ 29న పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగింది.

విద్యాదీవెన నిధులను ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి విడుదల చేశారు.

► జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు రూ.584 కోట్లు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.

► ఈ మొత్తంతో కలిపి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.18,576 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తం గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఖర్చు చేసిన మొత్తం కంటే రూ.6,435 కోట్లు అధికం.

► పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవా­లన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఇచ్చేలా తల్లులు–విద్యార్థుల జాయింట్‌ అకౌంట్‌లో నేరుగా జమ చేస్తున్నారు. 

► గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ప్రతి విద్యా సంవ­త్సరంలో రెండు వాయిదాలలో ఐటీఐ విద్యా­ర్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది.

► కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికీ వి­ద్యావసతి కింద తల్లులు, విద్యార్థుల జాయింట్‌ ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. అదేవిధంగా ఫైనల్‌ పరీక్షలు రాసిన, తుది సంవత్సరం ము­గుస్తున్న విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఆయా త్రైమాసికాలు ముగియకముందే మే 2023–ఆగస్ట్‌ 2023లలో 2,00,648 మంది విద్యార్థులకు  మేలు చేస్తూ రూ.185.85 కోట్లు ఇప్ప­టికే విడుదల చేసింది.

► అధికారంలోకి వచ్చిన ఈ 55 నెలల కాలంలో విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి­వరకు విద్యారంగంపై అక్షరాలా రూ.73,417 కో­ట్లు ఖర్చు చేసింది. జగనన్న విద్యా దీవెనకు సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కో­సం జగనన్నకు చెబుదాం–1902 నంబర్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది.

Nadu Nedu Scheme: ‘మా బడి – మంచి గుడి’ నాడు-నేడు అమ‌లుపై అభిప్రాయాలు ఇవే..

#Tags