Vinay Kumar: రష్యాకు కొత్త రాయబారిని నియమించిన కేంద్రం.. ఆయ‌న ఎవ‌రంటే..

విదేశీ వ్యవహరాల్లో నిపుణుడైన ఇండియన్‌ ఫారెన్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) అధికారి వినయ్‌కుమార్‌ను రష్యా రాయబారిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది.

ఈ మేరకు మార్చి 19వ తేదీ విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

1992 బ్యాచ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి అయిన వినయ్‌కుమార్‌ 2021 నుంచి మయన్మార్‌లో భారత రాయబారిగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం రష్యా రాయబారిగా పనిచేస్తున్న పవన్‌కుమార్‌ ఇటీవలే విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు.

సాధారణంగా మాస్కో, వాషింగ్టన్‌, లండన్‌, టోక్యో, కాన్‌బెర్రా నగరాలు భారత ఐఎఫ్‌ఎస్‌ అధికారులకు కీలక పోస్టింగ్‌లుగా భావిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో మిత్ర దేశం రష్యాతో సంబంధాలు మరింత మెరుగుపరిచుకునేందుకు అనుభవజ్ఞుడైన వినయ్‌కుమార్‌ను నియమించినట్లు తెలుస్తోంది.

New Election Commissioners: ఎలక్షన్‌ కమిషనర్లుగా జ్ఞానేశ్‌ కుమార్‌, సుఖ్‌బీర్‌ సంధూ

#Tags