Ratan Tata: దిగ్గజ పారిశ్రామికవేత్త 'రతన్‌ టాటా' కన్నుమూత

ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ నావల్‌ టాటా(86) కన్నుమూశారు.

చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రతన్ టాటా ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబ‌ర్ 9వ తేదీ రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని దేశవిదేశాల్లో విస్తరించి.. పేదవాడి కారు కలను తీర్చాలని ‘నానో’ తెచ్చిన టాటా గొప్ప వితరణశీలి. యువతకు ఆదర్శప్రాయుడు. విలువలపై వ్యాపార సామ్రా­జ్యాన్ని నిర్మించిన దార్శనికుడు. ఆయ‌న‌ మరణించినట్టు టాటా సన్స్‌ గ్రూప్‌ ప్రకటించింది. 

వివిధ రంగాలలో రతన్‌ టాటా సంస్థలు  
సంపదలో 65% విరాళం  
రతన్‌ టాటా 1937 డిసెంబర్ 28వ తేదీ ముంబైలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు నావల్‌ టాటా, సూనూ టాటా. ముంబై, సిమ్లాలో విద్యాభ్యాసం చేశారు. అమెరికాలోని కార్నెల్‌ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ చదివారు. అవివాహితుడైన రతన్‌ టాటా 1962లో టాటా సన్స్‌లో చేరారు. 1991 నుంచి 2012 దాకా, తర్వాత 2016 నుంచి 2017 టాటా సంస్థ చైర్మన్‌గా సేవలందించారు.

పారిశ్రామిక రంగానికి అందించిన సేవలకు గాను రతన్‌ టాటాను భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది. రతన్‌ టాటా వితరణశీలిగా పేరుగాంచారు.  తన సంపదలో దాదాపు 65 శాతం భాగాన్ని వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చారు. పలు స్టార్టప్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. 

Sitaram Yechury: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత
 
అనితరసాధ్యుడు..
బాల్యం.. విద్యాభ్యాసం.. 
పారిశ్రామిక దిగ్గజం, వితరణ శీలి రతన్‌ టాటా చాలా సాధారణ జీవితం గడిపేవారు. టాటా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జంషెడ్‌జీ టాటా కుమారుడు రతన్‌ జీ టాటా, దత్తత తీసుకున్న నవల్‌ టాటా, సూనూ టాటా ఆయన తల్లి దండ్రులు. 1948లో ఆయన తల్లిదండ్రులు విడిపోవడంతో రతన్‌జీ టాటా సతీమణి అయిన నవాజ్‌బాయ్‌ టాటా సంరక్షణలో పెరిగారు. జిమ్మీ టాటా ఆయనకు సోదరుడు కాగా, నోయెల్‌ టాటా సవతి సోదరుడు. రతన్‌ టాటా ముంబై, సిమ్లాలో విద్యాభ్యాసం చేశారు. అటుపైన అమెరికాలోని కార్నెల్‌ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ చదివారు.  

100 బిలియన్‌ డాలర్లకు టాటా గ్రూప్‌..
రతన్‌ టాటా 1962లో టాటా సన్స్‌లో చేరారు. సాధారణ ఉద్యోగి తరహాలోనే పని చేస్తూ కుటుంబ వ్యాపార మెళకువలు తెలుసుకోవడంలో నిమగ్నమయ్యారు. ఆర్థిక సమస్యల్లో ఉన్న నేషనల్‌ రేడియో అండ్‌ ఎల్రక్టానిక్స్‌ కంపెనీ (నెల్కో)కి డైరెక్టర్‌ ఇంచార్జ్‌గా 1971లో ఆయన నియమితులయ్యారు. కన్జూమర్‌ ఎల్రక్టానిక్స్‌ విభాగాన్ని గాడిలో పెట్టేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ, ఆర్థిక మందగమనం, కార్మిక సంఘాలపరమైన సమస్యల కారణంగా ఆ ప్రయత్నాలు అంతగా సఫలం కాలేదు. 

1977లో సంక్షోభంలో ఉన్న మరో గ్రూప్‌ సంస్థ ఎంప్రెస్‌ మిల్స్‌కి ఆయన బదిలీ అయ్యారు. మిల్లును పునరుద్ధరించేందుకు ఆయన ప్రణాళికలు వేసినప్పటికీ మిగతా అధికారులు కలిసి రాకపోవడంతో సంస్థను అంతిమంగా మూసివేయాల్సి వచ్చింది. మొత్తానికి 1991లో జేఆర్‌డీ టాటా ఆయన్ను టాటా గ్రూప్‌ చైర్మన్‌గా నియమించారు. భారీ బాధ్యతలను మోయడంలో ఆయనకున్న సామర్థ్యాలపై సందేహాల కారణంగా మిగతా అధికారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ రతన్‌ టాటా వాటన్నింటినీ తోసిరాజని తన సత్తా నిరూపించుకున్నారు. 

Vijaya Bharathi: ప్రముఖ రచయిత్రి విజయభారతి కన్నుమూత

గ్రూప్‌ను అగ్రగామిగా నిలిపారు. తన హయాంలో మేనేజ్‌మెంట్‌ తీరుతెన్నులను పూర్తిగా మార్చేసి గ్రూప్‌ కంపెనీలను పరుగులు తీయించారు. 2012లో ఆయన టాటా గ్రూప్‌ చైర్మన్‌ పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత చైర్మన్‌గా నియమితులైన సైరస్‌ మిస్త్రీతో విభేదాలు రావడంతో తిరిగి 2016 అక్టోబర్‌ నుంచి 2017 ఫిబ్రవరి వరకు మరోసారి చైర్మన్‌ బాధ్యతలు చేపట్టారు. అటు తర్వాత ఎన్‌.చంద్రశేఖరన్‌కు పగ్గాలు అప్పగించారు. 21 ఏళ్ల పాటు సాగిన రతన్‌ టాటా హయాంలో గ్రూప్‌ ఆదాయాలు 40 రెట్లు, లాభాలు 50 రెట్లు పెరిగాయి. 

దాతృత్వ శిఖరం కన్నుమూత
టాటా గ్రూప్‌ను అంతర్జాతీయ స్థాయిలో భారీగా విస్తరించారు రతన్‌ టాటా. ఆయ­న సారథ్యంలో టాటా గ్రూప్‌ గ్లోబల్‌ బ్రాండ్‌గా ఎదిగింది. సాఫ్ట్‌వేర్, టెలికం, ఫైనాన్స్, రిటైల్‌ తదితర రంగాల్లోకి గ్రూప్‌ విస్తరించింది. రతన్‌ టాటా బాధ్యతలు చేపట్టినప్పుడు 1991లో రూ.10,000 కోట్లుగా ఉన్న గ్రూప్‌ టర్నోవరు 2011–12లో ఆయన తప్పుకునే సమయానికి 100 బిలియన్‌ డాలర్లకు ఎగిసింది. 

సాల్ట్‌ నుంచి సాఫ్ట్‌వేర్‌ వరకు అన్ని విభాగాల్లోకి విస్తరించింది. పలు విదేశీ కంపెనీలను కొనుగోలు చేయడంతో గ్రూప్‌ ఆదాయాల్లో దాదాపు సగ భాగం విదేశాల నుంచే ఉంటోంది. ఆయన సాహసోపేత నిర్ణయాల కారణంగా కోరస్, జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్, టెట్లీ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు టాటా గ్రూప్‌లోకి చేరాయి. నానో, ఇండికా కార్లు ఆయన విజనే.  

Most Influential People: ‘ఏఐ 2024 అత్యంత ప్రభావశీలమైన వ్యక్తుల’ జాబితాలో టాప్ 10లో ఉన్న‌ది వీరే..

వితరణశీలి.. ఇన్వెస్టరు.. 
రతన్‌ టాటా గొప్ప వితరణశీలి. తన సంపదలో దాదాపు 60–65% భాగాన్ని ఆయన వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలకు విరాళమిచ్చారు. 2008­లో కార్నెల్‌ వర్సిటీకి 50 మిలియన్‌ డాలర్ల విరాళమిచ్చారు. ప్రధానంగా విద్య, ఔషధాలు, గ్రామీణాభివృద్ధి మొదలైన వి భాగాలపై దృష్టి పెట్టారు. ఆయన పలు అంకుర సంస్థల్లో విస్తృతంగా పెట్టుబడులు పెట్టారు. 

వ్యక్తిగత హోదాలో అలాగే ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ ద్వారా 30కి పైగా స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్‌ చేశారు. శ్నాప్‌డీల్, షావోమీ, ఓలా క్యాబ్స్, మొదలైన వాటిలో పెట్టుబడులు పెట్టారు. సీనియర్‌ సిటిజన్ల కోసం ఉద్దేశించిన గుడ్‌ఫెలోస్‌ అనే స్టార్టప్‌కు తోడ్పాటు అందించారు.  కరోనా నియంత్రణ కోసం రూ.1,500 కోట్లు అందించారు.

ఆయన అందుకున్న పురస్కారాలు..
పారిశ్రామిక దిగ్గజంగానే కాకుండా వితరణశీలిగా కూడా పేరొందిన రతన్‌ టాటాను పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు వరించాయి. పద్మ భూషణ్, పద్మ విభూషణ్‌ పురస్కారాలతో పాటు ఆయన మహారాష్ట్ర భూషణ్, అస్సాం వైభవ్‌ వంటి అవార్డులను కూడా అందుకున్నారు.

AG Noorani : న్యాయ కోవిదుడు ఏజీ నూరానీ కన్నుమూత

#Tags