Nobel Prize 2024: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి
ప్రోటీన్ల నిర్మాణం, డిజైన్‌పై చేసిన విశిష్ట పరిశోధనలకు గాను డేవిడ్ బెకర్, డెమిస్ హసబిస్, జాన్ ఎం.జంపర్ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
డేవిడ్ బెకర్: కంప్యుటేషనల్ ప్రొటీన్ డిజైన్‌లో పునాదులు వేసిన శాస్త్రవేత్త.
డెమిస్ హసబిస్: ప్రొటీన్ స్ట్రక్చర్ ప్రిడిక్షన్‌పై చేసిన పరిశోధనలకు గుర్తింపు.
జాన్ జంపర్: ప్రొటీన్ డిజైన్‌లో ముఖ్య పాత్ర పోషించిన శాస్త్రవేత్త.
విజేతలకు బహుమతితో పాటు వారికి 10 లక్షల డాలర్ల నగదు పురస్కారం అందనుంది. నోబెల్ పురస్కారాల ప్రకటన అక్టోబర్ 14 దాకా కొనసాగనుంది. అక్టోబర్ 8వ తేదీ ఫిజిక్స్, 9వ తేదీ కెమిస్ట్రీ, 10వ తేదీ సాహిత్య నోబెల్ అవార్డులను ప్రకటిస్తారు. అక్టోబర్ 14న ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రకటన ఉంటుంది. విజేతలకు డిసెంబర్ 10న పురస్కారాలను ప్రదానం చేస్తారు.
Nobel Prize 2024: ఫిజిక్స్‌లో జాన్ హాప్‌ఫీల్డ్, జెఫ్రీ హింటన్‌లకు నోబెల్ పురస్కారం